Home వార్తలు విరాట్ కోహ్లీకి అగ్నిపరీక్ష

విరాట్ కోహ్లీకి అగ్నిపరీక్ష

KOHLIటెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్డ్ ప్రకటించిన ధోని తదనంతరం కెప్టెన్సీ బాధ్యతలు విరాట్‌ను అప్పగించడం కొంతవరకు కోహ్లీ కెరీర్‌పై ప్రభావం చూపుతుందని చెప్పక తప్పదు. గతంలో అనేక సందర్భాలలో గమనించినట్లు అయితే కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోవాలంటే మేటి క్రికెటర్లు అంత ఉత్సాహం చూపకపోవటం మనకు తెలుసు. ఉదాహరణకు సచిన్ క్రికెటర్‌గా విశ్వవిఖ్యాతం చెందిన కెప్టెన్‌గా మాత్రం కొద్ది మ్యాచ్‌లకే పరిమితం అయినాడు. తనను కెప్టెన్సీ కొనసాగించమని క్రికెట్ కమిటీ ఆదేశించినప్పటికీ తనకు తాను కెప్టెన్సీ నిరాకరించడం వెనుక ప్రధానమైన కారణం ఎక్స్‌ట్రా బర్‌డెన్… అలాగే అనేక రకాలుగా ఒత్తిడికి లోనుకావడం సర్వసాధారణం. ఈ విషయాన్ని ముందుగానే తన అనుభవం నేర్పిన పాఠాలను దృష్టిలో ఉంచుకొని కెప్టెన్‌గా నిరాకరించడం, కొనసాగకపోవడం గమనించాల్సిన విషయం. మరికొన్ని సందర్భాలలో గమనిస్తే కెప్టెన్‌గా, కెరీర్ పరంగా అద్భుతంగా రాణించిన క్రికెటర్స్ కూడా లేకపోలేదు. అందుకు ఉదాహరణ M.S.ధోని, స్టీవ్‌వా, రికీపాంటింగ్, క్లైవ్‌లాయిడ్, అలిస్టర్ కుక్, హన్సీక్రొన్యె,గంగూలి, డివిలియర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది క్రికెటర్స్ రాణించిన వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా మన భారత్ క్రికెట్‌ను దృష్టిలో ఉంచుకుంటే అందరి ఆటగాళ్లతో మమేకం అయిపోవడం, వారిలో ఉన్న ఒడిదుడుకులు గమనిస్తూ, ఎప్పటికప్పుడు, సలహాలు, సూచనలు ఇవ్వడం, ప్రాక్టీసు పర్‌ఫెక్ట్‌గా చేయించడం లాంటివి భారత్ క్రికెట్ శిబిరంలో అంత ఆషామాషీ కాదు. ఇవన్నీ గమనించిన అనేక మంది క్రికెటర్స్ కెప్టెన్‌గా నిలదొక్కుకోవాలంటే తమకు తామే ప్రశ్నించుకునే వారు. అందుకే విదేశీ కోచ్‌లను కూడా నియామకం చేయడం మన ఆటగాళ్ళు మనకు సహకరించకపోవడం ముఖ్య కారణం. అందుకే సచిన్ లాంటి వాళ్ళు కెప్టెన్‌గా కాకుండా ఆటగానిగా మాత్రమే కొనసాగటానికి ఇష్టపడ్డారు. బ్రియాన్ లారా కూడా ఇదే రకంగా కెప్టెన్‌గా ఎక్కువ రోజులు కొనసాగకపోవడం గమనించాల్సిన విషయం.
ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్‌లో ఎన్నోమార్పులు, చేర్పులు, హంగులు, ఆర్భాటాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. 20 ట్వంటీ క్రికెట్‌లో IPL అని, వరల్డ్ కప్ అని, కొన్ని సిరీస్‌లో ఒకటి, రెండు 20 ట్వంటీ మ్యాచ్‌లు కూడా ఆడించడం కొనసాగుతున్నది. ధోని తర్వాత టెస్ట్‌లో కోహ్లీ ఆ తర్వాత వన్డేలో ధోని తర్వాత కోహ్లీనే కొనసాగిస్తారా? మరి ఎవరినైనా నియమిస్తారా? ప్రశ్నార్థకంగా మిగిలింది.
నేటి క్రికెట్‌లో ధృవతారగా వెలుగుతున్న కోహ్లీ రానున్న వెస్టిండీస్ టూర్‌లో కెప్టెన్‌గా రాణించి తన కెరీర్‌ను ఎలాంటి భంగం కలగకుండా కొనసాగించి తప్పకుండా రాహుల్ ద్రవిడ్‌లా పేరు తెచ్చుకుంటాడని అందరు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ విరాట్‌కు మాత్రం ఇది అగ్నిపరీక్ష అని చెప్పాలి.
అనిల్‌కుంబ్లే కోచ్‌గా రావడం ఒక వరం. అనిల్‌కుంబ్లే ఆటగానిలో ఉన్న సహజశైలిని ఏమాత్రం భంగం కలిగించనని చెప్పడం ప్రతి ఆటగాడికి కూడా ఒక రకమైన వ్యూహం, మెళకువలు ఉంటాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని, వాటికి భిన్నంగా, ఎలాంటి సలహాలు సూచనలు చేయనని కుంబ్లే అభివర్ణించడం గొప్ప విషయం. అలాగే ఈ సందర్భంలో కోహ్లీ కెప్టెన్సీకి కుంబ్లే సరియైన సమయంలో కోచ్‌గా లభించడం భారత్‌కు ఒక వరం అని అలాగే నాకు కూడా కెప్టెన్‌గా తన సలహాలు, సూచనలు సహకారం చాలా ఉపయోగపడతాయని భారత్ క్రికెట్ టెస్ట్‌లో కొత్త మలుపులు రానున్న సిరీస్‌లో చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీ గడ్డపై సరదాగా ఆడాలి, ఎలా విజయాలు సాధించాలి, తన అనుభవాన్ని రంగరించి, కోచింగ్ ఎలా ఇవ్వాలో అనిల్‌కుంబ్లేకు తెలుసు. మా సావాసంలో భారత్ మున్ముందు ఎన్నో విజయాలు సాధిస్తుంది అని కోహ్లీ తన మనసు విప్పాడు.