Search
Saturday 22 September 2018
  • :
  • :

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపిక

bcci

ఇంగ్లాండ్‌తో ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతున్న వన్డే సిరీస్ కోసం శుక్రవారం బిసిసిఐ జట్టును ప్రకటించింది. ఇటీవల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనీకి బదులుగా విరాట్ కోహ్లికి జట్టు పగ్గాలు దక్కాయి. ఇక చాలా కాలంగా జట్టుకు దూరమైన సినీయర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ తిరిగి జట్టులోకి వచ్చాడు. సురేష్ రైనాకు జట్టులో చోటు దక్కలేదు.

వన్డే జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), మహేంద్రసింగ్ ధోనీ(వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మనీశ్ పాండే, కెదార్ జాధవ్, యువరాజ్ సింగ్, అజింక్య రహానే, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్.

టీ20 జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), మహేంద్రసింగ్ ధోనీ(వికెట్ కీపర్), కెఎల్ రాహుల్, మన్‌దీప్ సింగ్, సురేష్ రైనా, రిషబ్ పంత్, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, మనీశ్ పాండే, అశ్విన్, రవీంద్ర జడేజా, చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, అశీష్ నెహ్రా.

Comments

comments