Home తాజా వార్తలు విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం..

విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం..

vrt

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌లో కోహ్లీ మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలని భావించినట్లు మేడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే లండన్ నుంచి మేడమ్ టుస్సాడ్స్ ఆర్టిస్టులు కోహ్లీకి సంబంధించి సుమారు 200 రకాల కొలతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా భారత్ మెర్లిన్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ అన్షూల్ జైన్ మాట్లాడుతూ.. ‘భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వెల్లడించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ‘మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో నా మైనపు విగ్రహం పెట్టడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని, నా జీవితంలో ఇది ఎప్పటికీ మరచిపోలేనని కోహ్లీ అన్నాడు. మ్యూజియం నిర్వాహకులకు ఈ సందర్భంగా కోహ్లీ ధన్యవాదాలు తెలియజేశాడు.