Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

పాలీ ఉమ్రిగర్ అవార్డు అందుకోనున్న కోహ్లి

kolhi

న్యూఢిల్లీ: బెంగళూరులో జూన్ 12న జరిగే బిసిసిఐ అవార్డుల ప్రదానోత్సవంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి పాలీ ఉమ్రిగర్ అవార్డును అందుకోనున్నాడు. 201617 నుంచి 201718 క్రికెట్ సీజన్‌లో అతడి అమోఘ రాణింపుకు గుర్తింపుగా ఈ అవార్డును అతడికి ప్రదానం చేయబోతున్నారు. ఈ విషయాన్ని బిసిసిఐ గురువారం ప్రకటించింది. పురుషుల విభాగంలో కోహ్లి ఈ టాప్ అవార్డును అందుకోనుండగా, మహిళా క్రికె ట్ విభాగంలో హర్మన్‌ప్రీత్, స్మృతి మందన రెండు సీజన్‌లలో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్లుగా పేర్కొనబడ్డారు. కోహ్లి అంతర్జాతీయ వన్డేలో 1111 పరుగులు, 101 సగటును, 201718 టెస్టు సీజన్‌లో 896 ప రుగులు చేసి టెస్టుల్లో 89.6 సగటును సా ధించాడు. ఢిల్లీలో ఈ సీజన్‌లో శ్రీలంకతో ఆడిన టెస్టు మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 243 చేశాడు. మూడు ఫార్మట్లలో అతడు 1847 పరుగుల సాధించాడు. ఇక హర్మన్ ప్రీత్ 2017 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాతో ఆడినప్పుడు అద్భుతంగా 171 పరుగులు చేసింది. కీర్తి శేషులు జగన్‌మోహన్ దాల్మియా గుర్తింపుగా నాలు గు అవార్డులను బిసిసిఐ ప్రకటించింది. ఎక్కువ పరుగులు, వికెట్లు తీసుకున్న క్రికెటర్‌కు జగన్ మోహన్ దాలియా ట్రోఫీ, అదేవిధంగా అండర్ 16 విజయ్ మరెంట్ ట్రో ఫీ ఉత్తమ జూనియర్‌కు , మహిళా క్రికెట్‌లో సీనియర్  క్రికెటర్‌కు అవార్డు ఇస్తారు. కేవ లం ఆటగాళ్లకే కాక బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ గుర్తించే క్రికెట్ బోర్డుకు కూడా అవార్డు ఇవ్వనున్నారు. గత ఏడాదికిగాను ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్‌కు ‘బెస్ట్ స్టేట్ అసోసియేషన్’ అవార్డును ప్రదానం చేయనున్నారు. ‘అవార్డులు క్రీడాకారుల్లో ఆ త్మవిశ్వాసాన్ని పెంచుతాయని, వారు సీజనులో మరింత బాగా రాణించేందుకు ఊతం ఇస్తాయి’ అని బిసిసిఐ సిఇఒ రాహుల్ జో హ్రి చెప్పారు. దీనికితోడు తొమ్మిది కేటగిరి ల్లో ప్రైజ్ మనీని రూ. 1 లక్ష నుంచి రూ. 1.5 లక్షలకు బిసిసిఐ పెంచింది.

Comments

comments