Home తాజా వార్తలు సన్ రైజర్స్ లక్ష్యం 160

సన్ రైజర్స్ లక్ష్యం 160

 

హైదరాబాద్: ఐపిఎల్-12లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో కోల్‌కత్తా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. కెకెఆర్ 160 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ సన్ రైజర్స్ ముందుంచింది. నైట్ రైడర్స్ ఓపెనర్ లీన్ ధాటిగా ఆడి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. నైట్ రైడర్స్ బ్యాట్సెమెన్లలో ఆర్ కెసింగ్(30), నరిన్(25), రస్సెల్(15),రానా(11), కార్తీక్(6), చావ్లా(4), శుభమన్ గిల్(3) పరుగులు చేసి ఔటయ్యారు. కరియప్పన్(9), పృధ్వీ రాజ్ (0) నాటౌట్ గా నిలిచారు.   హైదరాబాద్ బౌలర్లలో అహ్మాద్ మూడు వికెట్లు, భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. సందీప్ శర్మ, రషీద్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.

 

Kolkata Knight Riders Scored 159 Runs in Hyd Sun Risers