Home ఛాంపియన్స్ ట్రోఫీ సమరోత్సాహంతో కోల్‌కతా

సమరోత్సాహంతో కోల్‌కతా

నేడు ముంబయితో నాకౌట్ సమరం

గెలిచిన  జట్టుకు ఫైనల్ బెర్త్

iplబెంగళూరు: డిఫెండింగ్ చాంపియన్ సన్‌రైజర్స్ హైదరా బాద్‌పై గెలిచి ఊపుమీదున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ శుక్రవా రం ముంబయి ఇండియన్స్‌తో జరిగే రెండో క్వాలిఫయర్ ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లాలనే పట్టుదలతో కోల్‌కతా ఉంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో హైదరాబాద్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయించిన నైట్‌రైడర్స్ అద్భుత విజయంతో టైటిల్ రేసులో నిలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇందులో గెలిచే జట్టు ఆదివారం జరిగే ఫైన ల్లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌తో తలపడుతుంది. మరో వైపు తొలి క్వాలిఫయర్‌లో పుణె చేతిలో కంగుతిన్న ముంబయికి కోల్‌కతాతో పోరు క్లిష్టంగా మారింది. వరుస విజయాలతో జోరుమీద కనిపించిన ముంబయిని తొలి క్వాలిఫయర్‌లో పుణె చిత్తు చేసింది. దీంతో ముంబయి ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అయితే మళ్లీ పుంజుకొని ముందుకు సాగే సత్తా ముంబయికి ఉంది.
జోరుమీదున్నారు..
మరోవైపు వర్షం అడ్డంకిగా మారిన మ్యాచ్‌లో ఎంతో ఉద్వే గానికి లోనైనా చివరికి విజయంతో గట్టెక్కిన గంభీర్ సేన క్వాలిఫయర్-2 సమరానికి సమరోత్సాహంతో సిద్ధమైంది. బౌలర్లు ఫాంలోకి రావడం జట్టుకి ఊరటనిచ్చే అంశం. బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన హైదరాబాద్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన కోల్‌కతా బౌలర్లు ఈ మ్యాచ్‌లోనూ చెలరేగేందుకు సిద్ధంగా ఉన్నారు. ఫాస్ట్ బౌలర్లు కౌల్టర్ నైల్, ఉమేశ్ యాదవ్‌లు అద్భుతంగా రాణిస్తున్నారు. హైద రాబాద్‌ను కట్టడి చేయడంలో వీరద్దరూ కీలకపాత్ర పోషిం చారు. ఈసారి కూడా చెలరేగాలనే పట్టుదలతో కనిపిస్తు న్నారు. కౌల్టర్‌నైల్ నిలకడైన బౌలింగ్‌తో జట్టు విజయాల్లో కీలకంగా మారాడు. ముంబయిపై కూడా సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక, స్పిన్నర్ సునీల్ నరైన్ పొదు పుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. హైదరాబా ద్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసిన నరైన్ మరోసారి చెలరే గేందుకు సిద్ధంగా ఉన్నాడు. పియూష్ చావ్లా కూడా మెరు గైన ప్రదర్శన ఇస్తున్నాడు. రైజర్స్ కెప్టెన్ వార్నర్‌ను క్లీన్‌బౌ ల్డ్ చేసి జట్టును ఆదుకున్నాడు. ముంబయిపై కూడా రాణించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇక, బ్యాటింగ్‌లో కూడా గంభీర్ సేన చాలా బలంగా ఉంది. క్రిస్ లిన్, సునీ ల్ నరైన్, గంభీర్, యూసుఫ్ పఠాన్, సూర్యప్రకాష్ యాద వ్, ఇషాన్ జగ్గి వంటి మ్యాచ్ విన్నర్లు జట్టుకు అందుబాటు లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కూడా చెలరేగేందుకు సిద్ధమ య్యారు. కెప్టెన్ గంభీర్ అద్భుత ఫాంలో ఉన్నాడు. ఉతప్ప కూడా మెరుగ్గా ఆడుతున్నాడు. ఓపెనర్లు లిన్, నరైన్‌లు కూడా ప్రత్యర్థి బౌలర్లకు సమస్యలు సృష్టిస్తున్నారు. ఈ సారి కూడా బ్యాట్‌తో చెలరేగేందుకు కోల్‌కతా బ్యాట్స్‌మెన్ సిద్ధంగా ఉన్నారు.
విజయమే లక్షంగా…
మరోవైపు ముంబయి ఇండియన్స్ కూడా ఫైనల్‌కు చేరడ మే లక్షంగా పెట్టుకుంది. లీగ్ దశలో అద్భుతంగా రాణిం చిన రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ చెలరేగేందుకు సిద్ధమైం ది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబయి బలంగా ఉంది. అయితే పుణె మ్యాచ్‌లో అనుకున్న విధంగా రాణిం చలేక పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫాంతో సతమతమవుతున్నాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతి కూలంగా మారింది. అయితే కీలకమైన ఈ మ్యాచ్‌లో బ్యా ట్‌ను ఝులిపించాలనే పట్టుదలతో రోహిత్ ఉన్నాడు. సిమ న్స్, పొలార్డ్, రాయుడు, పాండ్యా సోదరులతో ముంబయి బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక, హర్భజన్, మలింగ, హార్ధిక్ పాండ్యా, కర్ణ్ శర్మ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా మెరుగ్గా కనిపిస్తోంది. సమష్టిగా రాణించి ఫైనల్‌కు దూసుకెళ్లాలనే పట్టుదలతో ఉంది. అంతేగాక, ఐపిఎల్‌లో కోల్‌కతాపై ముంబయికి అద్భుత రికార్డు ఉంది. ఇప్పటివరకు 20 మ్యాచులు ఆడిన ముంబై 15 సార్లు విజయం సాధించింది. ఈసారి కూడా రికార్డును కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులకు కొదవలేదు. దీంతో నాకౌట్ సమరం నువ్వానేనా అన్నట్టు సాగడం ఖాయం. గెలిచిన జట్టు ఆది వారం హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఫైనల్లో పుణెతో తలపడుతుంది.