Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

లయన్స్‌ను ఉతికేశారు

KKR

గంభీర్, క్రిస్‌లెన్
కోల్‌కతా ప్రతీకార విజయం
10 వికెట్ల తేడాతో నైట్‌రైడర్స్ శుభారంభం
అర్ధ శతకంతో ఆకట్టకున్న రైనా

రాజ్‌కోట్: ఐపిఎల్ -10 సీజన్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ రాజ్‌కోట్ వేదికగా గుజరాత్ లయన్స్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో కోల్‌కతా శుభారంభం చేసింది. గత సీజన్‌లో పరాజయానికి ప్రతీకారంగా విధ్వంసకర బ్యా టింగ్‌తో గుజరాత్‌ను మట్టికరిపించింది గంభీర్‌సేన. పా యింట్ల పట్టిక లో కోల్‌కతాకు రెండు పాయింట్లు లభిం చాయి. 184 పరుగుల విజయలక్షంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు కెప్టెన్ గౌతమ్ గంభీ ర్, క్రిస్ లెన్ అద్భుతంగా రాణించడంతో 10 పరుగుల తేడాతో లయన్స్‌పై ఘనవిజయం సాధించింది. ఆది నుంచి నిల కడగా ఆడుతూ వీరిద్దరూ స్కోరు బోర్డును పరు గులు పె ట్టించారు. తొలి వికెట్‌కు గంభీర్, లెన్‌లు జతగా 46 బంతుల్లో 100 పరుగుల భారీ భాగ స్వామ్యాన్ని నెల కొల్పారు. గంభీర్ (48 బంతుల్లో 12 ఫోర్లు) 76 పరుగు లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి అద్భు తమైన ఇన్నింగ్స్‌ను ఆడాడు. మరో ఓపెనర్ క్రిస్ లెన్ (41 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్)లు బాది 93 పరుగులతో సెంచరీ చేరువలో అజే యంగా నిలిచాడు. అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన గుజరాత్ లయన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. దీంతో కోల్‌కతా కు గుజరాత్ 184 పరుగుల భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతా ఓపెనర్ క్రిస్‌లెన్ కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.
రైనా రాణించినా..
తొలుత ఓపెనర్లుగా బరిలోకి దిగిన జాసన్ రాయ్ (14), మెక్‌ల్లామ్ (35) పరుగులకే నిష్క్రమించారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సురేశ్ రైనా అద్భుతమైన ఇన్నిం గ్స్‌తో దూసుకెళ్తూ (51 బంతుల్లో 7 బౌండరీలు)తో 68 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. మరో ఆటగాడు అరోన్ ఫించ్ (15) పరుగులకే చేతులే త్తేసి మూడో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ 3 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. మరో ఆటగాడు దినేశ్ కార్తీక్ (25 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్)తో 47 పరుగులు చేసి హాఫ్ సెంచరీకి అతి చేరువలో వెనుదిరిగాడు. రైనా, కార్తీక్ వీరిద్దరూ క్రీజులో నిలకడగా సమయస్ఫూర్తితో ఆడుతూ నాల్గో వికెట్‌కు 41 బంతుల్లో 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోల్‌కతా బౌలర్లలో కులశేఖర రెండు వికెట్లు తీసుకోగా, పీ యూస్ చావ్లా, బోల్ట్ తలో వికెట్, తీసుకున్నారు. కాగా, ఈ సీజన్‌లో గుజరాత్ లయన్స్ జట్టులో వినూత్న మార్పు లు చోటుచేసుకున్నాయి. జట్టులో బ్యాట్స్‌మెన్లంతా విదేశీ యులు కాగా, బౌలర్ల విభాగంలో స్వదేశీయులను ఎంపిక చేయడం జరిగింది. ఇప్పటికే రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా ఈ సీజన్‌లో గుజరాత్‌తో జరిగే మ్యా చ్‌లో తమ రికార్డును మరింత మెరుగుపర్చుకోవాలని య త్నించింది. కాగా, 2016 లో లయన్స్‌తో జరిగిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లో కోల్‌కతా ఓడిపోగా, లయన్స్ జట్టు రైనా సారథ్యంలో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

స్కోరుబోర్డు వివరాలు.. 

గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: జాసన్ రాయ్ (సి) యుసఫ్ పటాన్ (బి) పీయూస్ చావ్లా ; 14, మెక్‌ల్లామ్ ఎల్‌బిడబ్లు (బి) కుల్‌దీప్ యాదవ్; 35, అరోన్ ఫించ్ (సి) సూర్య కుమార్ యాదవ్ (బి) కుల్‌దీప్; 15, కెప్టెన్ సురేశ్ రైనా నాటౌట్; 68, దినేశ్ కార్తీక్ (సి) పీయూస్ యాదవ్ (బి) బోల్ట్ ; 47, డిఆర్ స్మిత్ నాటౌట్ ; 0.
ఎక్స్‌ట్రాలు: 4
మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లు) 183 పరుగులు
వికెట్ల పతనం: 1-22, 2-72, 3-92, 4-179.
కోల్‌కతా బౌలర్లు: ట్రెంట్ బోల్ట్ : 4-0-40-1, పీయూస్ చావ్లా : 4-0-33-1, సునీల్ నరేన్ : 4-0-33-0, క్రిస్ వోక్స్ : 3-0-35-0, కుల్‌దీప్ యాదవ్ : 4-0-25-2, యూసఫ్ పటాన్ : 1-0-15-0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గౌతమ్ గంభీర్ (కెప్టెన్) ; నాటౌట్ 76, క్రిస్ లెయిన్ నాటౌట్ 93;
ఎక్స్‌ట్రాలు: 15
మొత్తం: (14.5 ఓవర్లలో 0 వికెట్లు) 184 పరుగులు
వికెట్ల పతనం: 0
గుజరాత్ లయన్స్ బౌలర్లు: ప్రవీణ్ కుమార్ : 2-0-13-0, కులకర్ణి: 2.5-0-42-0, మణిప్రీత్ గోనీ : 2-0-32-0, శివిల్ కౌశిక్ : 4-0-40-0, డిఆర్ స్మిత్ : 1-0-23-0, జక్తీ : 3-0-30-0.

Comments

comments