Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అదరగొట్టేసిన మనీశ్, పఠాన్

వికెట్ల తేడాతో ఢిల్లీపై కోల్‌కతా విజయం,  శ్యామ్సన్, రిషబ్

Kolkata

ఢిల్లీ: ఐపిఎల్ 10వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఈ సీజన్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టును సొంతగడ్డపైనే ఓడించిన గంభీర్‌సేన 4 వికెట్ల తేడాతో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. కోల్‌కతా ఆటగాళ్లు యూసఫ్ పఠాన్ (59), మనీశ్ పాండే (61) పరుగులతో హాఫ్ సెంచరీలతో అదురగొట్టేశాడు. సోమవారం ఇక్కడ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 19.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి నాలుగో విజయాన్ని కైవసం చేసుకుంది. సొంతగడ్డపై ఢిల్లీ చిత్తుగా ఓడిపోయింది.

ఈ మ్యాచ్‌లో విజయంతో కోల్‌కతాకు 2 పాయింట్లు దక్కాయి. దీంతో పాయింట్ల పట్టికలో కోల్‌కతా అగ్రస్థానంలో నిలిచింది. ఓపెనర్ కెప్టెన్ గంభీర్ (14), గ్రాండ్‌హోం (1) పరుగులకే నిష్క్రమించారు. ఉతప్ప (4), మనీశ్ పాండే (69 నాటౌట్), యూసఫ్ పటాన్ (59) హాఫ్ సెంచరీలతో రాణించారు. సూర్య కుమార్ (7), వోక్స్ (3) మనీశ్ ఒక్కడే అజేయుడిగా నిలిచి కోల్‌క తాను విజయ తీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో జహీర్ ఖాన్, కమిన్స్ రెండు వికెట్లు తీసుకోగా, మోరిస్, మిశ్రా తలో వికెట్ తీసుకున్నారు. మనీశ్ పాండేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీడేర్ డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి సొంతగడ్డపై ఓటమిపాలైంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన శ్యామ్సన్ (39), బిల్లింగ్స్ (21) మంచి శుభారంభాన్ని అందించారు. రిషబ్ పంత్ (38), కరుణ్ నాయర్ (21), శ్రేయాస్ అయ్యర్ (26), మ్యాథ్యూస్ (1), మోరిస్ (16) పరుగులు చేయగా, కమిన్స్ (3), మహ్మద్ షమీ (0) నాటౌట్‌గా నిలిచారు. కోల్‌కతా బౌలర్లలో కౌల్టర్ మూడు వికెట్లు తీసుకోగా, వోక్స్, ఉమేశ్, నరేన్ తలో వికెట్ తీసుకున్నారు.

స్కోరు వివరాలు..
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్ : సంజు శామ్సన్ (సి) ఉతప్ప (బి) ఉమేశ్ యాదవ్ ; 39, బిల్లింగ్స్ (సి) ఉతప్ప (బి) కౌల్టర్ ; 21, కరుణ్ నాయర్ (బి) కౌల్టర్; 21, శ్రేయాస్ అయ్యర్ రనౌట్ (గ్రాండ్‌హోమ్/ఉతప్ప); 26, రిషబ్ పంత్ (సి) గంభీర్ (బి) కౌల్టర్ ; 38, మ్యాథ్యూస్ (బి) నరేన్ ; 1, మోరిస్ (సి) ఉమేశ్ యాదవ్ (బి) వోక్స్; 16, కమిన్స్ నాటౌట్ ; 3, మహ్మద్ షమీ నాటౌట్ ; 0. ఎక్స్‌ట్రాలు: 3. మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లు) 168 పరుగులు. వికెట్ల పతనం: 1-53, 2-63, 3-106, 4-110, 5-145, 6-153, 7-167. కోల్‌కతా బౌలర్లు : నాథన్ కౌల్టర్ 4-0-22-3, వో క్స్ 4-0-31-1, ఉమేశ్ యాదవ్ 4-0-53-1, నరేన్ 4-0-20-1, కుల్‌దీప్ యాదవ్ 3-0-29-0, గ్రాండ్‌హోమ్ 1-0-12-0.

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్: గౌతమ్ గంభీర్ (సి) మ్యాథ్యూస్ (బి) జహీర్ ఖాన్ ; 14, గ్రాండ్‌హోమ్ (సి) బిల్లింగ్స్ (బి) జహీర్ ఖాన్ ; 1, ఉతప్ప (సి) పంత్ (బి) కమిన్స్ ; 4, మనీశ్ పాండే నాటౌట్ ; 69, యూసఫ్ పఠాన్ (సి) & (బి) మోరిస్; 59, సూర్యకుమార్ యాదవ్ (సి) ఖాన్ (బి) కమిన్స్; 7, వోక్స్ స్టంప్ పంత్ (బి) మిశ్రా; 3, నరేన్ నాటౌట్; 1. ఎక్స్‌ట్రాలు : 11. మొత్తం: (19.5 ఓవర్లలో 6 వికెట్లు) 169 పరుగులు. వికెట్ల పతనం: 1-5, 2-19, 3-21, 4-131, 5-152, 6-130. ఢిల్లీ బౌలర్లు : జహీర్ ఖాన్ : 4-0-28-2, కమిన్స్ 4-0-39-2, మోరిస్ 4-0-30-1, మిశ్రా 2.5-0-26-0, మహ్మద్ షమీ 3-0-28-0, మ్యాథ్యూస్ : 2-0-15-0.

Comments

comments