Home తాజా వార్తలు షమీపై నాన్‌బెయిలబుల్ చార్జ్‌‌షీటు దాఖలు

షమీపై నాన్‌బెయిలబుల్ చార్జ్‌‌షీటు దాఖలు

కోల్‌కతా: ప్రపంచకప్‌కు ముందు టీమిండియా పేసర్ మహ్మద్ షమీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. గతంలో తన భార్య హసిన్‌ జహాన్‌తో షమీకి తీవ్ర విభేదాలు రావడంతో.. షమీపై హసిన్ హత్యాయత్నం, గృహహింస‌ కేసులు పెట్టిన సంగతి తెలిసిందే.  తాజాగా షమీపై ఆయన భార్య వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. దీంతో కోల్‌కతా పోలీసులు గురువారం అలీపూర్ పోలీస్ కోర్టులో నాన్‌బెయిలబుల్ నేరాల కింద షమీపై చార్జ్‌‌షీటు దాఖలు చేశారు.
మరో యువతితో తన భర్తకు వివాహేతర సంబంధం ఉందంటూ హసీన్ ఆరోపిస్తూ అందుకు సంబంధించిన స్ర్కీన్‌షాట్లను తేడాది మార్చి 7న విడుదల చేసి షాకిచ్చింది. షమీ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. దీంతో షమీ ఘాటుగా స్పదిస్తూ.. ఆమె తన కెరీర్‌ను నాశనం చేసేందుకే ఇలా ప్రవర్తిస్తోందని ఆరోపించాడు. అయితే ఈ ఆరోపణలపై స్పందించిన బిసిసిఐ అతడితో కాంట్రాక్ట్‌ను పెండింగ్‌లో పెట్టి దర్యాప్తు చేసింది. అయితే, మ్యాచ్‌ఫిక్సింగ్ ఆరోపణలు అబద్ధమని తేల్చి కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించింది. కాగా, షమీ ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో కోల్‌కతా పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌ అతనిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
 kolkata police file chargesheet against cricketer shami