Search
Saturday 22 September 2018
  • :
  • :

కోల్‌కతా బోణి

klkt

కోల్‌కతా : ఐపిఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ శుభారంభం చేసింది. ఆదివారం ఈడెన్ గార్డెన్‌లో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నాలుగు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును ఓ డించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ఓపెనర్ మెకొల్లమ్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో (43), స్టార్ ఆటగాడు డివిలియర్స్ ఐదు సిక్స ర్లు, ఒక ఫోర్‌తో 23 బంతుల్లోనే 44 పరుగులు చేశారు. చివర్లో మన్‌దీప్ సింగ్ 4ఫోర్లు, రెండు సిక్స్‌లతో 37 పరుగులు చేశారు. తర్వాత బ్యా టింగ్‌కు దిగిన కోల్‌కతా మరో ఏడు బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని అందుకుంది. సునీల్ నరైన్ 19 బంతుల్లోనే ఐదు సిక్స్‌లు, మరో 4 ఫో ర్లతో 50 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.

Comments

comments