Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత

kovai-Senthil

చెన్నై: కోలీవుడ్ లో ప్రముఖ హాస్య నటుడు కోవై సెంథిల్‌ (74) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా  ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స  పొందుతూ  ఆదివారం ఆయన తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు.  ‘పడ యప్ప,’ ‘పుదుమై పిత్తన్‌’, ‘గోవా’, ‘ఏయ్‌’ తదితర చిత్రాల్లో కమేడియన్ గా నటించారు. తన నలబై ఏళ్ల సినీ జీవిత కాలంలో 200పైగా చిత్రాల్లో నటించి,  తనదైన శైలిలో హాస్యం పండించి తమిళ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు. ఆయన అసలు పేరు కుమారస్వామి. కోవై ప్రాంతం  స్వస్థలం వడవల్లిలో ఆయనకు అంత్యక్రియలు జరుగుతాయని సన్నిహితులు తెలిపారు. ఆయన మృతికి నడిగర్‌ సంఘం సంతాపం వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.

Comments

comments