Home రాష్ట్ర వార్తలు కోమటిరెడ్డి, సంపత్ శాసన సభ్యత్వాల రద్దు

కోమటిరెడ్డి, సంపత్ శాసన సభ్యత్వాల రద్దు

cng

 జానా,ఉత్తమ్,షబ్బీర్ సహా 17 మంది సస్పెన్షన్

మన తెలంగాణ/ హైదరాబాద్ : గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభత్వాలు రద్దు చేస్తూ శాసనసభ మంగళవారం నాడు తీర్మానాన్ని ఆమోదించింది. అదే విధంగా ప్రతిపక్ష నాయకులు కుందూరు జానారెడ్డి సహా కాంగ్రెస్‌కు చెందిన 11 మంది ఎం ఎల్‌ఎలను బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేసింది. ఈ మేరకు శాససనసభ వ్యవహారాల శాఖమంత్రి టి.హరీశ్‌రావు సభలో రెండు తీర్మానాలను ప్రవేశపెట్టగా, మూజువాణి ఓటుతో తీర్మానాలను ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. మరో వైపు శాసనమండలిలో కూడా ప్రతిపక్ష నాయకులు షబ్బీర్ అలీ సహా ఆరుగురు ఎంఎల్‌సిలను బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్ ఎంఎల్‌ఎలలో ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డాక్టర్ జె.గీతారెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, టి.జీవన్‌రెడ్డి, డాక్టర్ జి.చిన్నారెడ్డి, డి.కె. అరుణ, పద్మావతి, టి.రామ్మోహన్‌రెడ్డి, సి.హెచ్. వంశీచంద్‌రెడ్డి, అనుబంధ సభ్యులు డి.మాధవరెడ్డిలు ఉన్నారు. ఎంఎల్‌సిలలో పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, ఆకుల లలిత, సంతోష్‌కుమార్‌లు ఉన్నారు. శాసనసభ సమావేశాలు ఉదయం ప్రారంభం కాగానే స్పీకర్ సి. మధుసూధనాచారి మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగ సమయంలో జరిగిన ఘటన దుర్మార్గమని, దురదృష్టకరమని, అవాంఛనీయమన్నారు. వీటి పట్ల తీవ్ర మనస్తాపాన్ని తెలియజేస్తున్నానని చెప్పారు. అనంతరం స్పీకర్ ఆదేశాల మేరకు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు 11 మంది కాంగ్రెస్ సభ్యులను బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటింగ్ ద్వారా తీర్మానాన్ని ఆమోదిస్తూ వారిని సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అనంతరం రాజ్యాంగంలోని 194(3) అధికరణ కింద కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్ శాసనభ్యత్వం రద్దును ప్రతిపాదిస్తూ మరో తీర్మానాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. గవర్నర్
ప్రసంగం సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు చాలా చాలా తీవ్రమైనవని, చట్ట సభలను అవమానపరిచేలా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వారి అవాంఛనీయ, ఘర్షణపూరిత వ్యవహార శైలి సభ్యుల హక్కులకు భంగ పరిచినట్లుగా ఉన్నదని, సభ గౌరవానికి విఘాతం కలిగించిందని తీర్మానాన్ని ప్రవేశపెడుతూ వ్యాఖ్యానించారు. ఈ తీర్మానాన్ని మూజువాణి ఓటింగ్ ద్వారా సభ ఆమోదిస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. అనంతరం సభ చర్య తీసుకున్న సభ్యులు సభను విడిచి బయటకు పోవాలని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేశారు. తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి కోరారు. మరోవైపు కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేయడం మొదలు పెట్టారు. దీంతో స్పీకర్ జోక్యం చేసుకుని సభను వదిలివెళ్లాలని మరోమారు సూచించారు. దీంతో కొద్ది సేపు సభ్యులకు మార్షల్స్‌కు మధ్య స్వల్ప వాదన జరిగింది. అనంతరం కాంగ్రెస్ సభ్యులు సభను వీడడంతో కార్యాకలాపాలు యథావిధిగా కొనసాగాయి.
దుర్మార్గ చర్యతో షాక్ గురయ్యా : స్పీకర్
గవర్నర్ ప్రసంగం సమయంలో కాంగ్రెస్ సభ్యులు చేసిన దాడిని చూసి తాను షాక్‌కు గురయ్యాయని స్పీకర్ మధుసూధనాచారి తెలిపారు. నాలుగేళ్లుగా సభ ఎంతో హుందాగా కొనసాగిందని, మన సభా వ్యహారాలను ఇతర రాష్ట్రాలు కూడా ప్రశంసించాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధకరమని, అవాంఛనీయమని వ్యాఖ్యానించారు. నాలుగేళ్లుగా సభకు ఎలాంటి మచ్చ రాలేదన్నారు. తాను ఇదంతా మనస్థాపంతో, వర్ణించలేని ఆవేదనతో తాను మాట్లాడుతున్నానని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష నాయకులు జానారెడ్డిను సస్పెండ్ చేయడాన్ని బిజెపి వ్యతిరేకించగా, సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని ఎంఐఎం విజ్ఞప్తి చేసింది.
మండలిలో కూడాఃశాసనమండలిలో మంగళవారం సభ ప్రారంభమైన వెంటనే ఆరుగురు కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనిని మూజువాణి ఓటింగ్ ద్వారా ఆమోదిస్తూ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యేంత వరకు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ప్రకటించారు. దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ సభ్యు