Home తాజా వార్తలు ఓట్ల కోసమే రైతుబంధు పథకం: కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ఓట్ల కోసమే రైతుబంధు పథకం: కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

KomatiReddy Speech About farmers scheme

 కొండమల్లెపల్లి : ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాటల గారడీతో తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నాడని సిఎల్పీ ఉపనేత, ఎంఎల్ఏ కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలో హైదరాబాద్‌ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మజీల్స్‌మేకర్ జిమ్‌ను ప్రారంభించారు. అనంతరం స్థానిక చౌరస్తాలోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాందీ, అధ్యక్షుడు రాహుల్‌గాందీ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తెలంగాణ ఇస్తే తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానన్న కెసిఆర్ మాట తప్పి అధికార దాహాంతో గద్దే నెక్కరన్నారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు దాటిన ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు దళితుడు ముఖ్యమంత్రి, పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, కెజీ టూ పీజీ ఉచిత విద్య, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూ పంపిణి, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమ బద్దీకరణ, నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు, రైతులకు రూణమాఫి వంటివి కలగానే మిగిలాయి తప్ప నేటికి ఏ ఒక్క హామీ పూర్తి చేయలేదని ఎద్దేవ చేశారు. తెలంగాణ ప్రజలకు పూటకో మాటలతో మభ్యపెడుతున్నడే తప్ప చేసిందేమిలేదన్నారు. రానున్న ఎన్నికలల్లో ఒడిపోతామనే భయంతో రైతులను మభ్యపెట్టడానికి రైతుబంధు పథకం ప్రవేశపెట్టాడని అది చివరకు సన్న, చిన్నకారు రైతులకు ఉపయోగపడకుండా బడా రైతులకే ఉపయోగపడిందని అన్నారు.

రైతుబంధు పథకం రైతులకు కష్టాలను కొని తెచ్చిందని అందులో రైతుల భూముల విరాలు దాదాపు 40 శాతం తప్పులతో రైతులు నిద్రపట్టకుండా చేసిందని, నేడు రైతులు ఆఫీస్‌ల, అధికారుల చుట్టు తిప్పుకుంటున్నారని అన్నారు. రైతుబంధు పథకం ద్వారా భూస్వాములకు, పదుల ఎకరాల రైతులు లబ్ధి పొందారు తప్ప రైతులుఎవ్వరు లాభాపడలేదని అన్నారు. బలహీన వర్గాల రైతులు కౌలు పోడు భూముల్లో అరుగాలం కష్టించి వ్యవసాయం చేసుకునే రైతుకు మద్దతు ధరను కల్పించాలని రైతులు అంటుంటే అధి అమలు చేయకుండా అడగనివి ఇవ్వడ ఎంత సమంజసం అని అన్నారు. లక్షల కోట్ల రూపాయలను ఆంధ్ర కాంట్రక్టర్లకు పనులు అప్పచెప్పి కోట్ల రూపాయలు కమీషన్‌ల రూపంలో దండుకుంటున్నారని అన్నారు. కెసిఆర్‌కు తెలంగాణ ప్రజలు మళ్లీ అధికారం ఇస్తే తెలంగాణను ఆంధ్ర వాళ్లకు అమ్ముకంటాడని అన్నారు. 2019 రానున్న సాధరణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు ప్రజలు ఓట్లు వెయ్యవద్దని వచ్చె ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కాయమని అన్నారు. కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చే విధంగా కృషి చేయాలని అందరు సహకరించాలని కార్యకర్తలతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ నేనావత్ జగన్‌లాల్‌నాయక్, డీసీసీ ప్రదాన కార్యదర్శి పస్నూరీ యుగేందర్‌రెడ్డి, కేతావత్ బీల్యా నాయక్,బొడిగె శంకర్‌గౌడ్, తిరుపతయ్య, మేకల కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు.