Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

కెసిఆర్ కు కోమటిరెడ్డి సవాల్…

Komatireddy Venkat Reddy Fires on CM KCR
నల్లగొండ: దానం నాగేందర్ టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా సిఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంఎల్ఎ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. రానున్నఎన్నికలకు తాము రెడీగా ఉన్నమని ప్రకటించారు. కెసిఆర్ కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయించి ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కెసిఆర్ అంగీకరీస్తే, రేపే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానాన్నిఒప్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాయడమే కాదు, టి-కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్, సీనియర్ నేత జానారెడ్డితో కూడా చర్చిస్తామన్నారు. కేబినెట్ లో బిసిలకు కెసిఆర్ ఎంత వరకు న్యాయం చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.

Comments

comments