Home తాజా వార్తలు రోదనలతో దద్దరిల్లిన దవాఖాన

రోదనలతో దద్దరిల్లిన దవాఖాన

మృతదేహాలను చూసేందుకు భారీగా తరలివచ్చిన జనం

Bus-Accident

మృతదేహాలను తరలించిన జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుల బం ధువుల రోదనలతో హృదయవిదారక పరిస్థితి నెలకొంది.   తమ వారిని కో ల్పోయిన బాధిత కుటుంబ సభ్యులు జిల్లా ప్రధాన ఆస్పత్రికి చేరుకుని శవా ల మీద పడి రోధించారు.  మృతుల కుటుంబ సభ్యుల రోధనలతో జిల్లా ప్రధాన ఆస్పత్రి  దద్దరిల్లింది. ప్రమాదంలో ఎక్కువగా జిల్లాలోని కొడిమ్యాల మండలానికి చెందిన శనివారంపేట, హిమ్మత్‌రావుపేట, రాంసాగర్, తిమ్మయ్యపల్లి, తిర్మలాపూర్, కోనాపూర్, సండ్రల్లపల్లి గ్రామాలకు చెందిన వారి తో పాటు మల్యాల మండలం ముత్యంపేట, బోయినిపెల్లి మండలం కోరెం, పెద్దపల్లి మండలం రాంపల్లి తదితర ప్రాంతాలకు చెందిన 56 మం ది మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని తమ వారి శవాలను చూసి బోరున విలపించారు. తమ వారు  విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించగా వారిని ఓదార్చడం కష్టతరమైంది. కాగా ప్రమాద సంఘటన గురించి తెలుసుకున్న పట్టణ ప్రజలతో పాటు వివిధ గ్రామాలకు చెందిన వారు పెద్ద ఎత్తు న ఆస్పత్రికి తరలివచ్చారు.  మృతదేహాలను  వారి కుటుంబ సభ్యులు, బం ధువులు  గుర్తించిన వెంటనే  పోస్టుమార్టం నిర్వహించి  వారికి అప్పగించారు.

బాధిత కుటుంబాలను ఆదుకుంటాం: కెటిఆర్
ప్రజా రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన ఆర్టీసీలో ఇంతటి ఘోరప్రమాదం జరగడం దురదృష్టకరమని కెటిఆర్ విచారం వ్యక్తం చేశా రు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఆయన హామీనిచ్చారు.

రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా :  కవిత

రోడ్డు ప్రమాద ఘటనపై నిజామాబాద్ ఎంపి కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటిం చిందని ఆమె ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు కవిత ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు.

ఆర్‌టిసి నిర్లక్షమే కొంపముంచింది

పరిమితికి మించి ప్రయాణికులకు అనుమతి
డీజిల్ ఖర్చు తగ్గుతుందని బస్సు రూట్ మార్పు
ప్రయాణికులంతా డ్రైవర్‌పై పడడంతో అదుపు తప్పిన బస్సు
ఆర్‌టిసి అధికారుల నిర్లక్షం, పరిమితికి మించిన ప్రయాణం వల్లనే కొండగట్టు ఘాట్ రోడ్డుపై బస్సు బోల్తా పడ్డ ప్రమాదం చోటు చేసుకుందని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్‌టిసి బస్సుకు ఫిట్‌నెస్ లేకపోవడమే కాకుం డా పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడమే కారణంగా తెలుస్తోంది. వాస్తవంగా బస్సు లో 50 మంది ప్రయాణీకులు మాత్రమే ప్రయాణించాల్సి ఉండగా ప్రమాదం జరిగిన బస్సులో 92 మంది ప్రయాణీకులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షు ల ద్వారా తెలుస్తోంది. కొడిమ్యాల మండలం శనివారంపేట గ్రామానికి జగిత్యాల డిపోకు చెం దిన బస్సు రోజుకు నాలుగు ట్రిప్పులు నడుస్తుం ది. అయితే మంగళవారం శనివారంపేట నుండి బయలుదేరిన బస్సు హిమ్మత్‌రావుపేట, రాంసాగర్, డబ్బుతిమ్మయ్యపల్లె, కొండగట్టు మీదుగా జగిత్యాలకు చేరుకుంటుంది. బస్సులో ఎక్కువగా ప్రయాణీకులు ఉండడంతో టాటా ఎస్ వాహనాన్ని ఢీకొట్టిన సమయంలో డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో బస్సులో నిలుచుని ప్రయాణిస్తున్న వారంతా ఒక్కసారిగా ముందుకు ఒరిగారు. కొం త మంది డ్రైవర్‌పై పడడంతో బస్సు అదుపు తప్పి లోయలో పడినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నా రు. కాగా ఆర్‌టిసి అధికారులు డ్రైవర్లకు, కండక్టర్లకు నిర్ధేశించే ఆర్థిక లక్షాలను అధిగమించేందుకు సిబ్బంది పడరాని పాట్లు పడుతూ అమాయక ప్రయాణీకుల ప్రాణాల మీదికి తెస్తున్నట్లు ఈ సంఘటనే ఉదాహరణగా నిలుస్తోందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.
ధన దాహమే ప్రాణాలు తీసింది
కొడిమ్యాల మండలం శనివారంపేట నుంచి జగిత్యాలకు వెళ్లే క్రమంలో కొండగట్టు ఘాట్ రోడ్డులో బస్సులు సహా ఇతర భారీ వాహనాలకు అనుమతి లేదు. కానీ ఈ ఘాట్ మార్గం నుండి వెళ్తే నాలుగు కిలో మీటర్ల దూరం తగ్గి డీజిల్ ఆదా అవుతుందని గ్రహించిన అధికారులు ఆర్‌టిసి బస్సును ఈ ఘాట్ రోడ్డుపైనే నడుపుతున్నారు. వాస్తవంగా జగిత్యాల నుంచి శనివారంపేటకు నడిచే ఆర్‌టిసి బస్సు ప్రతిసారి దొంగలమర్రి మీ దుగా వెళ్తుండేది. ఆర్‌టిసికి తగినంత ఆదాయం రావడం లేదనే కారణంతోనే ఇటీవల ఈ ఘాట్ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగిస్తున్నారు.

ప్రాణాలు కోల్పోయిన ఉత్తమ డ్రైవర్

ఘాట్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బస్సు డ్రైవర్ శ్రీనివాస్ విధి నిర్వాహణలో అంకిత భావంతో పని చేసే వ్యక్తిగా గుర్తింపు ఉంది. అతని సేవకు గుర్తింపుగా గత ఆగస్టు 15న ఆర్‌టిసి ఉన్నతాధికారుల నుంచి ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు అందుకున్నాడు. వాహనం ఫిట్‌నెస్‌గా లేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా అధికారులు పెడచెవిన పెట్టడంతో ఫిట్‌నెస్ లేని ఈ వాహనం ప్రమాదానికి గురైందని ఆర్‌టిసి డ్రైవర్లు అంటున్నారు. ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు అందుకున్న శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోవడం పట్ల ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

ఆర్‌టిసి జిగిత్యాల డిఎం సస్పెండ్

కొండగట్టులో జరిగిన ఆర్‌టిసి బస్సు లోయలో పడ్డ సంఘటనకు బాధ్యుడిగా గుర్తించి జగిత్యాల ఆర్‌టిసి డిపో మేనేజర్ హన్మంతరావును సస్పెండ్ చేస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ప్రకటించారు.