Home తాజా వార్తలు కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కోనేరు కోనప్ప…

కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన కోనేరు కోనప్ప…

kcr

హైదరాబాద్: ఎంఎల్ఎ కోనేరు కోనప్ప సిఎం కెసిఆర్‌కు మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. సిర్పూర్ కాగజ్‌నగర్ పేపర్ మిల్లు పునరుద్ధరణకు సిఎం చేసిన కృషి మరువలేనిదని ఆయన కొనియాడారు. సిర్పూర్ నియోజకవర్గం ప్రజల తరపున, పేపరు మిల్లు కార్మికుల తరపున సిఎం కెసిఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కెసిఆర్‌ను కలిసిన వారిలో మంత్రులు కెటిఆర్, జోగు రామన్న, లోక భూమారెడ్డి తదితరులు ఉన్నారు.