Home తాజా వార్తలు నాడు ఇల్లెందు ఎంఎల్ఎగా.. నేడు జడ్పి చైర్మన్‌గా కోరం

నాడు ఇల్లెందు ఎంఎల్ఎగా.. నేడు జడ్పి చైర్మన్‌గా కోరం

koram kanakaiah

ఇల్లెందు: నాడు ఇల్లెందు ఎంఎల్ఎగా… నేడు జిల్లా పరిషత్ చైర్మన్‌గా కోరం బాధ్యతలు చేపట్టడం విశేషం. శనివారం కోరం జడ్పి చైర్మన్‌గా ఎన్నికైన సందర్బంగా టిఆర్‌ఎస్ శ్రేణుల్లో సంబరాలు ఆంబరాన్ని అంటాయి. గత ఏడాది శాసనసభ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో కోరం ఓటమిని చవిచుసింది తెలిసిందే. జనంలో ఆయనకున్న పేరు, మంచితనాన్ని టిఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం గుర్తించింది. నిరంతరం శ్రామికుడి గుర్తింపు ఉన్న కోరంకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని అధిష్టానం హామీ ఇచ్చింది. అందులో భాగంగానే మండల పరిషత్ ఎన్నికల్లో టేకులపల్లి జడ్పిటిసిగా బరిలో నిలబెట్టి, కోరం విజయానికి టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేశారు. అనంతరం అధిష్టానం హామీ ప్రకారం కోరం కనకయ్యకు జడ్పీ చైర్మన్ పదవిని కట్టబెట్టింది.
టిఆర్‌ఎస్ శ్రేణుల సంబరాలు : టేకులపల్లి జడ్పిటిసిగా గెలుపొందిన కోరం కనకయ్య భద్రాద్రి కొత్తగూడెంం జిల్లా పరిషత్ తొలి చైర్మన్‌గా ఎన్నికైయ్యారు. చైర్మన్ ఎన్నిక పూర్తి అయిన అనంతరం కొత్తగూడెం పట్టణం నుంచి ఇల్లెందు వరకు టిఆర్‌ఎస్ శ్రేణులు వియోజయోత్సవ సంబరాలను జరిపారు. టపాసులు కాలుస్తు, మీఠాయిలు పంపిణీ , రంగులు పూసుకోని సంబరాలను ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం నుంచి కాన్వాయిగా ఇల్లెందు పట్టణానికి చేరుకున్న కోరం జగదాంబ సెంటర్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలలు వేసి, తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. భారీ ఎత్తున తరలి వచ్చిన టిఆర్‌ఎస్ శ్రేణులు జై తెలంగాణ నినాదాలతో పట్టణం మారుమోగింది. ఈ విజయోత్సవ ర్యాలీలో టిఆర్‌ఎస్ జిల్లా నాయకులు మడత వెంకట్‌గౌడ్, లక్కినేని సురేందర్, ఇల్లెందు పట్టణ అధ్యక్షులు సిలివేరి సత్యనారాయణ, ఎంపిటిసి మండల రాము, కౌన్సిలర్లు కమల్ కోరి, పూనెం సురేందర్,  తదితరులు పాల్గొన్నారు.

koram kanakaiah Elected As Zilla Parishad Chairman