Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

రూ. 5500కోట్లు సేకరణపై కోటక్ బ్యాంక్ దృష్టి

Kotak-Mahindra

న్యూఢిల్లీ : ప్రైవేటు సంస్థ కొటక్ మహీంద్రా బ్యాంక్ మూలధన నిధుల సేకరణపై దృష్టిపెట్టింది. దాదాపు రూ.5500 కోట్ల నిధులను సమీకరించి.. బ్యాంక్, అనుబంధ సంస్థల మరింత పటిష్టం చేసేందుకు వినియోగించనున్నామని వెల్లడించింది. 6.2 కోట్ల ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సుమారు రూ.5,500 కోట్లను సమీకరించనుంది. గరిష్టంగా 3.4 శాతం ఈక్విటీ డైల్యూషన్ ద్వారా ఈ నిధులను సేకరించనుండగా, దీనికి బ్యాంక్ బోర్డ్ మీటింగ్‌లో సభ్యులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో ప్రమోటర్ ఉదయ్ వాటా 32.1 శాతం నుంచి 31.2 శాతానికి తగ్గనుంది. యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్‌ను కొనుగోలు చేయనున్నట్లు వస్తోన్న ఊహాగానాలకు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఉదయ్ కోటక్ కొట్టిపారేశారు. ఇతర సంస్థల కొనుగోళ్లు, విలీనాల ద్వారా కాకుండా ఖాతాదారుల సంఖ్యను సొంతంగానే పెంచుకుంటామని, బ్యాంకు వృద్ధి ప్రణాళికలను, వ్యూహాలను వివరించేందుకు మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. గురువారం మార్కెట్‌లో ఈ బ్యాంక్ షేరు లాభాలతో దూసుకుపోయింది. 1.5శాతానికి పైగా లాభపడింది.
కోటక్ మహీంద్రా జీరో బ్యాలెన్స్ ఖాతా
ప్రైవేటు సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంక్ సరికొత్త 811 డిజిటల్ బ్యాంకింగ్ పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా అన్ని డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి చార్జీలు లేకుండా జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. వచ్చే 18 నెలల్లో కస్టమర్లను రెట్టింపు చేయడమే లక్షమని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ ఉదయ్ కోటక్ అన్నారు. ఏప్రిల్ 1నుంచి ఎస్‌బిఐ వంధ్ట ప్రధాన బ్యాంకులు చార్జీల బాదుడుకు సిద్థమవుతున్న నేపథ్యంలో కొటక్ మహీంద్రా ఖాతాదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 811 ప్లాన్ తో సున్నా బ్యాలెన్స్ సేవింగ్ ఖాతాతో పాటు అన్ని డిజిటల్ లావాదేవీలను కూడా ఉచితంగా అందించనుంది. ఈ ఖాతా తెరవడానికి ఆధార్, పాన్ నెంబర్ ఉంటే చాలని బ్యాంక్ ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించినట్టు బ్యాంక్ వెల్లడించింది. మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రోత్సహించేందుకు, వచ్చే 18 నెలల్లో 16 మిలియన్ల వినియోగదారులను సాధించే లక్ష్యంతో ఉన్నట్టు (కెఎంబి) తెలిపింది. ఎక్కడైనా, ఎప్పుడైనా, ఐదు నిమిషాలలోనే మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ద్వారా ఈ ఖాతాను తెరవవచ్చు. ఆధార్ ఆధారిత వన్ టైం పాస్‌వర్డ్ ప్రమాణీకరణ ద్వారా ఖాతా ఓపెన్ అవుతుంది. 811 పొదుపు ఖాతా పథకం ద్వాదా 100 పైగా ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆర్థిక లావాదేవీలు నిర్వహణతోపాటు, ఆన్లైన్ షాపింగ్, విమానాలు, సినిమా టిక్కెట్లు, హోటల్ గదులు బుకింగ్ సేవలను పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సేవలను కూడా అనుమతిస్తున్న ఈ బ్యాంక్.. కస్టమర్లకు వర్చ్యువల్ డెబిట్ కార్డు ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు పొదుపు ఖాతా నిల్వపై సంవత్సరానికి 6 శాతం దాకా వడ్డీని చెల్లించనున్నామని ఉదయ్ కోటక్ ప్రకటించారు.

Comments

comments