Home ఆంధ్రప్రదేశ్ వార్తలు ఎన్‌టిఆర్‌ను అంకుల్ అని పిలిచేవాడిని…

ఎన్‌టిఆర్‌ను అంకుల్ అని పిలిచేవాడిని…

Koteshwara Prasadహైదరాబాద్ : ఎన్ టిఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి ఓ కొడుకున్నాడన్న సంగతి చాలా మందికి తెలియదు. లక్ష్మీపార్వతి, వీరగంధం సుబ్బారావులకు కోటేశ్వర ప్రసాద్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం అతను డాక్టర్ గా పని చేస్తున్నారు. సుబ్బారావుకు విడాకులు ఇచ్చిన అనంతరం లక్ష్మీపార్వతి ఎన్ టిఆర్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో లక్ష్మీపార్వతి కొడుకు కోటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ… ఎన్ టిఆర్ ను తాను అంకుల్ అని పిలిచేవాడనని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తాను ఒక పాట పాడితే ఎన్ టిఆర్ తనను అభినందించారని కోటేశ్వర ప్రసాద్ వెల్లడించారు. రాం గోపాల్ వర్మ తీసిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో వందకు 90 శాతం నిజాలను చూపించారని ఆయన స్పష్టం చేశారు. తాను లక్ష్మీపార్వతి కొడుకునన్న విషయం తన తోటి వైద్యులకు కూడా తెలియదని ఆయన పేర్కొన్నారు. తన చిన్న తనంలో ఎక్కువగా ప్రముఖ నటుడు మోహన్ బాబు ఇంట్లో గడిపినట్టు ఆయన వెల్లడించారు.

Koteshwara Prasad Comments on NTR