Home వార్తలు వైభవంగా క్రిష్, రమ్యల నిశ్చితార్థ వేడుక

వైభవంగా క్రిష్, రమ్యల నిశ్చితార్థ వేడుక

krishఆగస్టు 8న జరుగనున్న వివాహం

దర్శకుడు క్రిష్ త్వరలో పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. క్రిష్, డాక్టర్ రమ్యల నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో శనివారం ఉదయం జరిగిన ఈ వేడుకలో కొందరు సినీ సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్, రానాతో పాటు కె.రాఘవేంద్రరావు, సిరివెన్నెల సీతారామశాస్త్రి తదితరులు ఈ వేడుకకు హాజరై క్రిష్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఇరు కుటుంబాల పెద్దలు ఆగస్టు 8న రాత్రి 2 గంటల 28 నిమిషాలకు క్రిష్, రమ్యల పెళ్లి జరపాలని నిర్ణయించారు. ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించబోతున్నారు. ఇక క్రిష్ ప్రస్తుతం బాలకృష్ణతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని ఆయన ప్లాన్ చేశారు.