Home సినిమా ‘ఖబడ్దార్’కు క్రిష్ వివరణ

‘ఖబడ్దార్’కు క్రిష్ వివరణ

Krishఅత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన బాలకృష్ణ నూరవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ఆడియో వేడుకలో దర్శకుడు క్రిష్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ స్పీచ్ చివరలో ఇచ్చిన ‘ఖబడ్దార్’ వార్నింగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు క్రిష్ ఈ వార్నింగ్ ఎవరికిచ్చాడంటూ రచ్చ మొదలైంది. అయితే కొందరు  ఇది మెగాస్టార్ చిరంజీవి 150వ మూవీకి ఇచ్చిన వార్నింగ్ ఇదని కామెంట్ చేశారు. తమ సినిమాతో పోటీకి వస్తున్న నేపథ్యంలో ఈ కామెంట్ చేశాడని విశ్లేషించారు. దీనికి స్పందించిన క్రిష్ ఇందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టంచేశాడు. తనకు అల్లుఅర్జున్, వరుణ్‌తేజ్‌లతో మంచి స్నేహం ఉందని చరణ్‌తో కూడా ఎప్పటినుంచో ఫ్రెండ్‌షిప్ ఉందని చెప్పాడు. తన ప్రతి ఎదుగుదలలో మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహం ఉందని… మెగా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని తాను ఏ మాట అనలేదన్నాడు. తెలుగు జాతి చరిత్రను మరిచిపోయిన తెలుగువాళ్లనుద్దేశించి ఈ మాట అన్నానని స్పష్టంచేశాడు.