Search
Friday 21 September 2018
  • :
  • :

పెళ్లి పీటలెక్కనున్న క్రిష్

krishనేడున్న ప్రతిభావంతులైన డైరెక్టర్లలో రాధాకృష్ణ జాగర్లముడి (క్రిష్) ఒకరు. యూని వర్సల్ సబ్జెక్ట్‌తో సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా ఆయన పేరుగాంచాడు. 2008లో ‘గాయం’ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించిన క్రిష్… తొలి సినిమా తోనే హిట్ కొట్టాడు. ఆతర్వాత వేదం, కృష్ణం వందే జగద్గురుం వంటి డిఫరెం ట్ ఎంటర్‌టైనర్‌లను ఆయన తెరకెక్కించాడు. ఇటీవల రెండవ ప్రపంచం యు ద్ధం నేపథ్యంలో తెరకెక్కించిన ‘కంచె’ చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు. వరుణ్‌తేజ్ హీరోగా చేసిన ఈ చిత్రానికిగాను దర్శకుడిగా క్రిష్ జాతీయ అవార్డును సాధించాడు. తాజా సమాచారం ప్రకారం క్రిష్ త్వరలో పెళ్లి చేసుకో బోతున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన వధువు డాక్టర్‌గా పనిచేస్తున్నట్టు సమాచారం. అమెరికాలో నివసించే సోదరుడితో పాటు అతని కుటుంబ సభ్యులు క్రిష్‌ను పెళ్లిచేసుకోమని గత కొంతకాలంగా చెబుతున్నారు. జాతీయ అవార్డును సాధించడంతో తన కల నెరవేరిందని భావించిన క్రిష్ చివరికి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇక క్రిష్ పెళ్లిని పెద్దలు కుదిర్చారు. ఈ సంవత్సరం మధ్యలో అతని పెళ్లి జరుగనుందని సమాచారం. ఇక క్రిష్ ప్రస్తుతం బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమీపుత్ర చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

Comments

comments