Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

కృష్ణబోర్డు వివక్ష

టెలిమెట్రీ సంస్థపై తెలంగాణ ఫిర్యాదును, వాదనలను సమావేశం మినిట్స్‌లో
రికార్డు చేయని వైనం

Krishna-Board

హైదరాబాద్: పోతిరెడ్డిపాడు టెలీమెట్రీ ట్యాంపరింగ్‌పై కృష్ణా బోర్డు ఏకపక్ష వైఖరిని మరోమారు బయటపెట్టుకుంది. టెలీమెట్రీ సెన్సార్లు ఏర్పాటు చేసిన మెకట్రానిక్స్ ఏజెన్సీని కాపాడడానికి తన పరిధిలో సంపూర్ణ శక్తిని బోర్డు ఉపయోగించింది. ట్యాంపరింగ్‌పై ఇటీవలే కృష్ణా బోర్డు నిర్వహించిన సమావేశం వాడివేడిగా జరిగింది. అయితే సమావేశం మినట్స్‌లో మాత్రం వచ్చాము, కలిసాము, చెప్పాము అంటూ నాలుగు ముక్కల్లో మినట్స్‌ను రికార్డు చేశారు. ట్యాంపరింగ్‌పై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదును, దీనిపై జరిగిన వాదనలను, మెకట్రానిక్స్ కంపెనీ ట్యాంపరింగ్‌ను పరోక్షంగా ఒప్పుకున్న విషయా న్ని అందులో పొందుపరుచలేదు. ఈ సమావేశం లో నాగార్జునసాగర్ చీఫ్ ఇంజనీర్ సునీల్ తెలంగాణ ప్రభుత్వ వైఖరిని సమర్ధంగా వినిపించారు. అయితే అంతకు ముందే టెలీమెట్రీ ఏజెన్సీని ఏదో విధంగా బయటపడేయాలన్న పక్షపాత నిర్ణయా న్ని బోర్డు తీసుకుంది. దీనికి తోడు ఏజెన్సీ యాజమాన్యం స్వస్థలం మహారాష్ట్రలోని పూణె. కృష్ణా బోర్డు చైర్మన్ శ్రీవాస్తవ స్వస్థలం కూడా అదే కావడం గమనార్హం. ఓ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తగ్గట్లుగా దూకుడు వ్యవహరిస్తుండడం, మరో వైపు సొంత ఊరు పూణేకు చెందిన ఏజెన్సీని కాపాడే ప్రయత్నాల్లో బోర్డు ఉభయతారకంగా వ్యవహరించింది. ప్రారంభించిన టెలీమెట్రీని అధికారికం కాదని, ఇంకా ట్రయల్ రన్నే చేస్తున్నామంటూ బుకాయిస్తూనే, ఇకపై టెలీమెట్రీ డాటా ను ఇరు రాష్ట్రాలకు  చెప్పే మార్చాలని ఏజెన్సీని బోర్డు ఆదేశించింది. ఇదిలా ఉండగా సమావేశంలో జరిగిన అసలు విషయాలేవి రికార్డు చేయకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఇటీవలే సాగర్‌కు నీటి విడుదలపై కేంద్రానికి బోర్డు తరపున ఫిర్యాదు చేసింది. దీంతో తొలి నుంచి ఆంధ్ర పక్షపాత వైఖరిపై, తెలంగాణ వ్యతిరేకంగా ఉన్న బోర్డు వ్యవహారశైలిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉంది. దీనిపై ఇరిగేషన్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధికారులతో సమాలోచనలు జరిపారు. అఫెక్స్ కౌన్సిల్‌లో లేవనెత్తాలా, నిరసన లేఖ రాయాలా అన్న అంశంపై చర్చిస్తున్నారు. దీంతో పాటు కొత్తగా నితిన్ గడ్కరీ కేంద్ర మంత్రిగా నియమితులు కావడంతో ముఖ్యమంత్రితో లేఖ రాయిస్తే ఎలా ఉంటుందన్న అంశంపైనా సమాలోచనలు సాగిస్తున్నారు.

Comments

comments