Search
Monday 24 September 2018
  • :
  • :

యుకెలో కృష్ణకు ప్రశంసలు

Krishna

యూకేలో లో జరిగిన ‘ది వాయిస్ కిడ్స్ యూకే 2018’ పోటీల్లో భారత సంతతికి చెందిన 10ఏళ్ల బాలుడు కృష్ణ తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. ప్రేక్షకులని ఉర్రూతలూగించాడు. న్యాయనిర్ణేతలు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పోటీల్లో భారతీయ సంగీత పరికరమైన హార్మోనియం వాయిస్తూ  ’హౌ డీప్ ఈజ్ యువర్ లవ్’ అంటూ అక్కడి పాటను బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘ యే జవానీ హై దివానీ’ చిత్రంలోని ‘బాలం పిచ్‌కారీ’వంటి సూపర్‌హిట్ పాటతో మిక్స్ చేసి పాడాడు.

Courtesy by viva Video

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. పాట పాడటం అయిపోయాక న్యాయనిర్ణేతలు కృష్ణ వద్దకు వచ్చి ఈ పరికరం ఏంటని అడిగారు. ఇది భారతీయ సంప్రదాయ సంగీత పరికరం హార్మోనియం అని కృష్ణ జవాబు చెప్పాడు. నువ్వు వేసుకున్న షేర్వానీ బావుంది అని జడ్జి అంటే ‘అందులో వజ్రాలు ఉన్నాయి’ అని కృష్ణ ఫన్నీగా అన్నాడు.  ఒక మహిళా న్యాయ నిర్ణేత నీ పరికరం మాకు ఇస్తావా అని అడిగిందట. దానికి కృష్ణ మీరు కూడా కొనుక్కుని నేర్చుకోమని తెలివిగా సమాధానం చెప్తున్న వీడియో నెటిజన్లను ఆకర్షించింది.

చిన్నారి కృష్ణ మాట్లాడుతూ నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. మా కుటుంబ సభ్యులది సంగీత నేపథ్యం వల్లే నాకు సంగీతమంటే మక్కువ . నాకు గణేశ్ దేవుడు అంటే చాలా ఇష్టం. ఈ పోటీల్లో కొత్త తరహాలో ప్రదర్శనలో పాల్గొనాలని ఆలోచించి ఈ హార్మోనియాన్ని తెచ్చుకున్నాను. కొన్ని రోజుల పాటు సాధన చేసి తర్వాత రెండు పాటలను కలిపి పాడాలని అని నిర్ణయించుకుని అలాగే ప్రాక్టీస్ చేశాను. నా కోచ్ సహాయంతో  విజయవంతంగా ఈ పోటీలో పాల్గొన్నాను’ అని సంతోషంగా చెప్పాడు.

 

Courtesy by Lorraine

Comments

comments