Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్  కృష్ణాష్టమి

Krishnashtami‘స్టార్ హీరో నటించే సత్తా ఉన్న కథ ఇది. సునీల్ సినిమాకు కావల్సిన అంశాలను జోడించి తెరకెక్కించాం. దీని వెనుక వాసువర్మ కష్టం ఎంతో ఉంది. సునీల్ ఈ కథకు కరెక్ట్‌గా ఫిట్ అయ్యాడు. ఫస్ట్ కాపీ చూశాక వాసువర్మ ఎలా ఉందని అడిగాడు. సింపుల్‌గా థమ్సప్ సింబల్ చూపించాను. ఈ సినిమా సక్సెస్ విషయంలో నా అంచనాల్ని దాటినా ఆశ్చర్యపోనవసరం లేదు”అని దిల్‌రాజు అన్నారు. ఆయన నిర్మాతగా సునీల్, నిక్కీ గల్రాని, డింపుల్ చోపడే నటీనటులుగా వాసువర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కృష్ణాష్టమి’. ఈనెల 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆడియో సక్సెస్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్లాటినం డిస్క్ వేడుకను నిర్వహించారు. దిల్‌రాజు చిత్ర యూనిట్‌కు ప్లాటినం డిస్క్ షీల్డ్‌లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “ఏడాదిన్నర క్రితం సునీల్‌కు ఈ సినిమా లైన్ చెప్పాను. ఆయన వెంటనే చేద్దాం అన్నాడు. తర్వాత వాసువర్మకి ఈ కథ చెప్తే కాదనలేక విన్నాడు. ఇందులో ఏదో మిస్ అయిందని ఆరు నెలలు స్క్రిప్ట్ వర్క్ చేసి పూర్తి కథను తయారుచేశాడు. నేను ఈ రోజు ఇలా ఉన్నానంటే వాసువర్మ కూడా ఓ కారణం. కెరీర్ ప్రారంభంలో నా సూపర్ హిట్ సినిమాలు దిల్, ఆర్య, బొమ్మరిల్లు సినిమాలకు నా పక్కనే ఉన్నాడు. అతనిలో గొప్ప రచయిత ఉన్నాడు. ఈ సినిమాతో దర్శకుడిగా నిరూపించుకుంటాడు. 2.50 నిమిషాల అవుట్‌పుట్‌ని 2.15 నిమిషాలకు కుదించాం. బెటర్ అవుట్‌పుట్ కోసం సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరి సలహా తీసుకున్నాం. ఈనెల 19న విడుదల కాబోతున్న మా చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకొని మా సంస్థ మంచి పేరు తీసుకొస్తుంది”అని అన్నారు. సునీల్ మాట్లాడుతూ “నా కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రమిది. ఈ సినిమాలో చాలా ఆనందంగా కనిపిస్తాను. కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రమిది. వాసువర్మ నా కెరీర్‌కు మంచి సినిమా ఇచ్చాడు. ‘మర్యాద రామన్న’ సినిమా చేసినప్పుడు ఎంత ఆనందంగా ఫీలయ్యానో ఈ సినిమాకు అలాగే ఫీలయ్యాను”అని చెప్పారు. వాసువర్మ మాట్లాడుతూ “ హిట్ సినిమాకు కావలసిన అన్ని అంశాలు సమపాళ్లలో కుదిరిన సినిమా ఇది. సునీల్ కావలసిన దానికన్నా ఎక్కువ కష్టపడి పనిచేశాడు. దిల్‌రాజు ది బెస్ట్ అవుట్‌పుట్ కోసం ఎంత ఖర్చయినా చేస్తారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దినేష్, నిక్కీ గల్రాని, గౌతంరాజు, ఛోటా కె.నాయుడు, అనంత శ్రీరామ్, పృథ్వీ తదితరులతో పాటు సినిమా యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు.

Comments

comments