Home తాజా వార్తలు సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురు

supreme-court

న్యూఢిల్లీ: కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కొట్టివేసింది.

కృష్ణా జలాల పంపకంపై బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని పరిశీలించిన కోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా, మిగతా పిటిషన్లపై మాత్రం విచారణ కొనసాగుతుందని కోర్టు వెల్లడించింది.