Home ఎడిటోరియల్ కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు దగా

కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు దగా

మన్నారం నాగరాజు

krishna-damపాలమూరు అంటే గుర్తుకొచ్చేది వలసలు. ఈ పరిస్థితిని మార్చేపని ఏ ప్రభుత్వాలు చేయలేకపోతు న్నాయి. అసలు జిల్లాకు మహ బూబ్‌నగర్ అనే పేరు ఎలా వచ్చింది. ఈ జిల్లా వెనుకటి పేరు రుక్కమ్మపేట, పాలమూరు. 1883 డిసెంబర్ 4న మీర్ మహబూబ్ అలీఖాన్ ఆసఫ్ జీ6 జ్ఞాపకార్ధం ‘మహబూబ్‌నగర్’గా పేరు మార్చారు. ఒకపక్క జూరాల, కోయిల్‌సాగర్, సరళా సాగర్ ముఖ్యమైన పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి.
నెట్టెంపాడు 22 టియంసి నీటి సామర్థ్యం, కల్వకుర్తి 25టియంసి నీరు, ఎస్‌ఎల్‌బిసి 30టియంసిల నీరును కృష్ణా నది నుండి కేటాయిస్తారు. ప్రస్తుతం ఇవి నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవిగాక బీమా లిఫ్ట్ ప్రాజెక్టు దాదాపు 2 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చే విధంగా డిజైన్ చేశారు. దీనికి రెండు లిఫ్టులు నిర్మించారు. లిఫ్ట్ 1ద్వారా 1,11,000 ఎకరాలను ఆత్మ కూరు, తాలూక చిన్న చింతకుంట, వనపర్తి, పెబ్బేరు, మొదలగు మండ లాలలో భూమిని సాగులోకి తీసుకు రావడానికి కల్వకుర్తి ఎస్‌ఎల్ బిసి స్టేజ్1, స్టేజ్2, స్టేజ్3గా విభజించారు, ప్రస్తుతం ఈ పనులు సాగు తున్నా యి. స్టేజ్2, స్టేజ్3గా విభజించారు, ఈ పనులు కూడా జరుగు తున్నా యి. 30 టియంసిలతో చేపట్టిన ఎస్‌ఎల్‌బిసి సొరంగం ప్రస్తుతం 30 సం॥రాల నుండి నిర్మాణం దశలోనే ఉంది. కృష్ణాలో కేటాయించిన 307 టియంసిల నీటిని ప్రాజెక్టుల పనులు కాలేదనే నెపంతో ఆంధ్ర పాలకులు తరలించారు. 1996 నాటికి ఎస్‌ఎల్‌బిసి ప్రాజక్టు పూర్తి కావాలి. దీని ద్వారా దాదాపు 3 లక్షల ఎకరాల భూమి సాగులోకి వస్తుంది. కృష్ణా జలాల ద్వారా 1960 సంవత్సరం నాటికి సీమాంధ్ర ప్రాంతంలో పెంచు కున్న సాగువినియోగం 1)13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టా ఆయ కట్టు (181.20టియంసి)లు, 2)22 లక్షల ఎకరాల నాగార్జున సాగర్ ఆయ కట్టు (281టియం)లు, 3) రాయలసీమకు కెసి. కెనాల్, తుంగభద్ర కాలువ ద్వారా 6.50లక్షల ఎకరాల ఆయకట్టుకు 102 టియంసిలు మొత్తం 767+33=800 టియంసిలు నీటిని బచావత్ ట్రిబ్యునల్ 1973 సం॥ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడం జరి గింది. (తీర్పు అమ లు 31.05.2000 వరకు) చట్టప్రకారంగా 800 టియంసిలలో తెలంగాణాకు రావాల్సిన 68.50% అనగా 548.20 టియంసిల నీటి వాటా దక్కలేదు. కేవలం 34.75% అనగా 277.86 టియంసిల నీటి వాట దక్కింది.
27లక్షల ఆయకట్టకు సరిపోను కృష్ణ నీళ్ళను అనగా 270 టియంసిల నీళ్ళను దిగువనున్న కోస్తా జిల్లాలకు త్యాగం చేయడం జరిగిందని, నాగార్జునసాగర్ ఆయకట్టులో ఒక్క వంతు తెలంగాణకు, 3పాళ్ళు కోస్తా జిల్లాలకు. కేవలం 18% పరివాహక ప్రాంతంగా ఉన్న రాయలసీమ వాటాకు మించి అనుభవిస్తూ తెలంగాణాకు అన్యాయం జరుగుతోంది. ఇది సరిపోదని ఒక సంవత్సరానికి 2900 మిలియన్ల యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే క్ష్యంతో నిర్మించిన శ్రీశైలం డ్యాం రాయలసీమ కొరకే నిర్మిచుకున్నట్లుగా, శ్రీశైలం డ్యాం నీళ్ళను వరద జలాల పేరుతో రాయలసీమకు అక్రమంగా తరలించుకుపోయే కుట్రలో భాగంగా ఈ డ్యాంను ఒక ఆనకట్టగా మార్చి ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా పోతిరెడ్డిపాడు రెగ్యులలేటర్ (తూం) సామర్థ్యం 44 వేలు క్యూసెక్కులకు అనగా (4 తూం ల నుండి 10 తూం లకు) పెంచి 203 టియంసి నికరజలాలను ఈ డ్యాం నుండి, వరద జలాల ముసుగులో తరలించుకుపోతున్నారు. కింద ఉన్న నాగార్జున సాగర్ ప్రాజక్టు ఎండి పోయి నామమాత్రంగా మారింది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఇప్పుడు సేద్యంలో ఉన్న 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందడంలేదు. నాగార్జునసాగర్ జలవిద్యుత్ సామర్థ్యం 2,237 మిలియన్ యూనిట్లు నిలిచిపోయింది. ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందక మనుషుల శరీరాలు వంకరలు తిరుగుతున్నాయి. సిఎం రాజశేఖర్ రెడ్డి పెంచిన పోతిరెడ్డిపాడు 10 రెగ్యులేటర్ తూంలను తెలంగాణాకు న్యాయం జరిగేలా తిరిగి సవరించాలి.
ప్రఖ్యాత నీటి పారుదల ఇంజనీరు టి.హనుమంతరావుగారు చూపించిన పద్దతిలో వరదనీటిని రాయలసీమ తరలించడానికి, విడిగా వరద కాల్వ, తూంలు + 880 ఫీట్లు లేదా 875 పీట్ల కాల్వలు ఏర్పాటు చేసినట్లు అయితే, రాయలసీమ ఆంధ్రప్రదేశ్ నాయకులపట్ల, ప్రజలకు ఎవరిపట్ల అనుమానం ఉండదు. లేకుంటే భవిష్యత్తులో నీటికొరతతో తెలంగాణ ఎడారిగా మారిపోతుంది. మన తెలంగాణ ప్రభుత్వం రాబోయేకాలంలో సాగునీటి పథకాలను సంపూర్ణంగా పూర్తి చేసి, పాలమూరు వలసలను నివారించాలి. మన సి.ఎం. పాలమూరు ప్రజల వలస జీవితాలను అరికట్టాలంటే వెంటనే నిర్మాణంలో ఉన్న కోయిల్‌సాగర్ కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా 1, 2 ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. పాలమూరు జిల్లాలో గత ప్రభుత్వం చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి దాదాపు 1500 కోట్ల రూపాయలు వెచ్చిస్తే 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం 80, 90శాతం పూర్తి అయిన పాత ప్రాజెక్టులను పట్టించుకోకుండా కొత్త ప్రాజెక్టుల వెంట పరుగుతీస్తోంది.
– రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ లోక్‌సత్తా పార్టీ
95508 44433