Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

షాకింగ్ సర్‌ప్రైజ్‌గా ‘కృష్ణాష్టమి’

Dil-Rajuసునీల్, నిక్కీ గల్రాని హీరోహీరోయిన్లుగా వాసువర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మించిన చిత్రం ‘కృష్ణాష్టమి’. ఈ చిత్రం శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌రాజు చెప్పిన సినిమా విశేషాలు…

అందుకే ఆలస్యమైంది…
వాస్తవానికి ‘కృష్ణాష్టమి’ సినిమా షూటింగ్ గత ఏడాది ఆగస్టులోనే పూర్తయింది. కానీ సెప్టెంబర్‌లో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమా రిలీజ్ ఉండడం వలన అక్టోబర్‌లో ‘కృష్ణాష్టమి’ని విడుదల చేయాలనుకున్నాం. ఆ సమయంలో వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఆతర్వాత సంక్రాంతికి కూడా స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడంతో మా సినిమా విడుదలను వాయిదావేశాం. చివరికి మా చిత్రాన్ని శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం.
అల్లు అర్జున్ చేయాల్సింది కానీ…
గోపీచంద్ మలినేని ‘పండగ చేస్కో’ సినిమాకు ముందు ఈ సినిమా కథ చెప్పాడు. నాకెంతో నచ్చిన ఈ సినిమా కథను అల్లుఅర్జున్‌కు వినిపించాను. ఆర్య, పరుగులాంటి సినిమాల తర్వాత మన కాంబినేషన్‌లో వచ్చే సినిమా కొత్తగా ఉండాలని బన్నీ భావించాడు. నేను కూడా బన్నీ చెప్పిన విషయం గురించి ఆలోచించాను. ఆతర్వాత అల్లుఅర్జున్ మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యాడు.
సునీల్‌కు ఎంతో నచ్చింది…
టాలెంటెడ్ వాసువర్మ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తే బావుంటుందని తనకు ఈ కథ వినిపించాను. ఈ కథను తను డెవలప్ చేస్తూ… ఇంకా పర్‌ఫెక్ట్‌గా తీర్చిదిద్దాడు. నిజానికి అప్పుడు వాసువర్మ… సాయిధరమ్‌తేజ్‌తో ‘లవర్’ అనే సినిమా చేయబోతు న్నాడు. ఇక తేజుని ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాకు షిఫ్ట్ చేసి వాసుతో ఈ ప్రాజెక్ట్ మొదలుపె ట్టాను. సునీల్‌కు స్టోరీ చెప్పగానే అతనికి ఎంతో నచ్చింది. ఈ సినిమా కోసం మరే ప్రాజెక్ట్‌ను ఒప్పుకోనని 80 శాతం షూటింగ్‌ను వరుసగా చేశాడు సునీల్.
ఘన విజయం సాధిస్తుంది…
సునీల్ నటించిన అందాలరాముడు, పూల రంగడు సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కొత్తగా ఉంటుంది. తనలో ఉండే ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అవ్వకుండా హీరోయిజం ప్రతిబింబించే విధంగా సినిమా చేశాం. ఈ ట్రీట్‌మెంట్ ప్రేక్షకులకు షాకింగ్ సర్‌ప్రైజ్‌గా ఉంటుంది. ‘కృష్ణాష్టమి’ ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది.
క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…
ఈ సినిమా కొత్తగా ఉంటుందని చెప్పను కానీ ఖచ్చితంగా ప్రేక్షకు లకు నచ్చే విధంగా ఉంటుంది. సింపుల్ స్టోరీతో తెరకెక్కిన చిత్రమిది. పక్కవాళ్లకు సమస్య వస్తే దాన్ని పరిష్కరించే వ్యక్తి… తనకు వచ్చిన సమస్యను ఎలా పరిష్కరి స్తాడు అనేదే కథ. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమా తీశాం.
కృష్ణవంశీతో మూడు భాషల్లో…
మా బ్యానర్‌లో కృష్ణవంశీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాం. ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషల్లో ద్విభాష చిత్రంగా తెరకెక్కిస్తాం. హిందీలో మాత్రం డబ్ చేస్తాం. ఇది సోషియో ఫాంటసీ మూవీ. కొంత హార్రర్ కూడా ఉంటుంది.
చేతిలో ఐదు, ఆరు ప్రాజెక్ట్…
ప్రస్తుతం ఐదు నుంచి ఆరు ప్రాజెక్ట్ వర్కింగ్‌లో ఉన్నాయి. ఇకనుంచి సంవత్సరానికి మూడు, నాలుగు సినిమాలు చేయాలనుకుంటున్నాం.

Comments

comments