Home తాజా వార్తలు ‘కృష్ణార్జునయుద్ధం’.. ది వార్ బిగిన్స్ (టీజ‌ర్)

‘కృష్ణార్జునయుద్ధం’.. ది వార్ బిగిన్స్ (టీజ‌ర్)

Krishnarjuna-Yuddham

హైదరాబాద్: నేచుర‌ల్‌ స్టార్ నాని,  టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కృష్ణార్జున యుద్ధం’. చిత్ర యూనిట్ శనివారం ఈ మూవీ టీజర్ ను విడుదల చేసింది. చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ పాత్రలో ఊర‌మాస్‌గా కనిపించ‌నున్న‌ నాని, అర్జున్ పాత్ర‌లో రాక్‌స్టార్‌గా అలరించనున్నాడు. నాని సరసన కథనాయికలుగా అనుపమ పరమేశ్వరన్‌, రుక్సార్‌ మిర్ నటిస్తున్నారు.  హిప్ హాప్ త‌మీజా మూవీకి స్వరాలు అందిస్తున్నాడు. షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గరకపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

https://youtu.be/pdfyHCkKa_8