Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఫిబ్రవరి 5న కృష్ణాష్టమి

krishnashtamiహీరో సునీల్ నటించిన తాజా చిత్రం ‘కృష్ణాష్టమి’. వాసువర్మ దర్వకత్వంలో దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రంలో నిక్కి గల్రాని, డింపుల్ చోపడేలు కథానాయికలు. దినేష్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆడియో వేడుకను రాజమండ్రిలోని జి.ఐ.ఇ.టి కాలేజీలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన దర్శకులు వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్ ‘కృష్ణాష్టమి’ ఆడియో సిడిలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి మాట్లాడుతూ “కృష్ణాష్టమి మంచి విజయం సాధిస్తుంది. సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న దినేష్‌కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. చిత్ర దర్శకుడు వాసువర్మ మాట్లాడుతూ “సునీల్‌తో వంద సినిమాలు తీసినా బోర్ కొట్టదు. దినేష్‌కు ఫస్ట్ సినిమా అయినప్పటికీ వంద సినిమాలకు సంగీతమందించిన మ్యూజిక్ డైరెక్టర్‌లా ట్యూన్స్ ఇచ్చాడు. సీతారామశాస్త్రి మూడు నిమిషాలు కథ గురించి చెబితే అద్భుతమైన పాట అందించారు”అని చెప్పారు. హీరో సునీల్ మాట్లాడుతూ “చోటా కె.నాయుడు, వాసువర్మ చూపించినంత అందంగా ఎవరూ నన్ను చూపించలేదు. రెండున్నర గంటల పాటు నవ్వించే సినిమా కృష్ణాష్టమి”అని అన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ “డైరెక్టర్ వాసువర్మకు మంచి సక్సెస్‌నివ్వాలని కోరుకుంటున్నాను. సునీల్ ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్‌లలా కాకుండా కొత్తగా చేశాడు. ఫిబ్రవరి 5న సినిమాను విడుదల చేస్తున్నాం”అని చెప్పారు. మ్యూజిక్ డైరెక్టర్ దినేష్  మాట్లాడుతూ “నా ఫస్ట్ ఆడియో కాలేజీలో రిలీజ్ కావడం సంతోషంగా ఉంది. నా మొదటి సినిమా దిల్‌రాజు బ్యానర్‌లో చేస్తానని అనుకోలేదు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కెమెరామెన్ చోటా కె.నాయుడు, హీరోయిన్‌లు డింపుల్ చోపడే, నిక్కి గల్రాని తదితరులు పాల్గొన్నారు.

Comments

comments