Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

9న కృష్ణాష్టమి పాటల వేడుక

krishnashtamiమాస్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్న హీరో సునీల్ నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కృష్ణాష్టమి’. వాసు వర్మ దర్శకత్వంలో దిల్‌రాజు నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఆడియోను ఈనెల 9న రాజమండ్రిలోని జిఐఇటి కాలేజీలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. నిక్కి గల్రాని, డింపుల్ చోపడే హీరోయిన్‌లుగా నటించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతాన్ని అందించారు. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ “చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా రూపుదిద్దుకుంటోంది. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలతో పాటు అటు క్లాస ఇటు మాస్‌ను ఆకట్టుకునే కుటుంబ విలువలు ఈ చిత్రంలో ఉంటాయి. అమెరికా నుంచి వచ్చిన ఒక కుర్రాడు ఇండియాలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు అనేది సినిమా మెయిన్ పాయింట్. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశాం”అని తెలిపారు. బ్రహ్మానందం, అశుతోష్ రానా, ముఖేష్ రుషి, పోసాని కృష్ణమురళి, సుమన్, సప్తగిరి, పవిత్ర లోకేష్, తులసి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీః చోటా కె.నాయుడు, ఎడిటర్‌ః గౌతంరాజు, సంగీతంః దినేష్, కథః శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ టీం, ఫైట్స్‌ః అనల్ అరసు, ఆర్ట్‌ః ఎస్.రవీందర్.

Comments

comments