Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

సంక్రాంతికి ‘కృష్ణాష్టమి’

sunilప్రతి సంక్రాంతి సీజన్‌లో ఖచ్చితంగా ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వద్ద పోటీపడడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి సంక్రాంతి సీజన్ గతంలో ఎన్నడూ లేనివిధంగా రసవత్తరంగా మారింది. షూటింగ్ ఆలస్యం కావడం వలన మహేష్‌బాబు ‘బ్రహ్మోత్సవం’, పవన్‌కల్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ సిని మాలు సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోవడంతో ఎణ్‌టిఆర్ ‘నాన్నకు ప్రేమతో’, నందమూరి బాలకృష్ణ ‘డిక్టేటర్’ సినిమాలు మాత్రమే సం క్రాంతి బరిలో మిగిలాయి. ఈ లిస్టులో నాగా ర్జున ద్విపాత్రాభినయం చేసిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా వచ్చి చేరింది. వీటితో పాటు తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘24’ సిని మాను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయనున్నారు. తాజాగా ఈ నాలు గు సినిమాల పక్కన మరో సినిమా కూడా వచ్చి చేరింది. అదే సునీల్ హీరోగా నటించిన ‘కృష్ణా ష్టమి’. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా దాదాపు పూర్తిచేసుకున్న ఈ సినిమా రిలీజ్ కోసం సరైన డేట్‌ను చూస్తున్న నిర్మాత దిల్‌రాజు సంక్రాంతి సీజన్ అయితే బాగుంటుందని నిర్ణయించినట్లు సమాచారం. వాసువర్మ దర్శక త్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘కృష్ణాష్టమి’. నిక్కి గల్రాని హీరో యిన్‌గా నటించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతాన్ని అందించగా ప్రముఖ రచయిత కోన వెంకట్ కథను సమకూర్చారు. ఈ చిత్రంలో బ్రహ్మా నందం, అశోతోష్ రానా, ముఖేష్ రుషి, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటించారు.

Comments

comments