Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

అస్థిపంజరాలతో కలిసి డాన్స్!

Kriti Sanon has taken a horror-comedy avatar

కాదేది కవితకు అనర్హం అన్నాడు ఓ మహాకవి. ఇప్పుడు కాదేది ఐటమ్‌సాంగ్‌కు అనర్హం అంటున్నారు నవతరం దర్శకులు. తెలుగులో మహేశ్‌తో  ‘1… నేనొక్కడినే’, నాగచైతన్యతో  ‘దోచెయ్’ సినిమాలు చేసిన బ్యూటీ కృతిసనన్‌కు తెలుగులో పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో ఈ భామ బాలీవుడ్‌పై దృష్టి పెట్టి అక్కడ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో ‘స్త్రీ’ అనే సినిమా చేస్తోంది. ఈ మల్టీస్టారర్‌లో కృతి ఓ ఐటమ్‌సాంగ్ చేసింది. ఆవో కభీ హవేలీ పే… అంటూ సాగే ఈ పాట వెరైటీ థీమ్‌తో రూపుదిద్దుకుంది. ఈ పాటలో పాడుబడిన బంగళాలో అస్థిపంజరాలతో పాటు డాన్సర్లతో కలిసి కృతి వేసిన స్టెప్పులకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. నడుముని వయ్యారంగా తిప్పుతూ హొయలు పోతూ కృతిసనన్ చేసిన స్టెప్పులను చూసి మైమరచిపోతున్నారు. ఈ పాటకు కేవలం రెండు రోజుల్లో యూట్యూబ్‌లో రెండు మిలియన్ల వ్యూస్ రావడం విశేషం. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే కృతిసనన్ ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రంలో నటించింది. ఈ చిత్రంపై ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. మొదటి మూడు భాగాలు సూపర్‌హిట్ అయ్యాయి కాబట్టి నాలుగవ భాగం కూడా ఘన విజయం సాధిస్తుందని కృతి ఆశిస్తోంది.

Comments

comments