Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ప్రపంచకప్‌లో ఆడడమే లక్ష్యం: కృనాల్ పాండ్య

Krunal-Pandya

ముంబయి: వచ్చే ఏడాది ఇంగ్లండ్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో ఆడడమే తన ఏకైక లక్ష్యమని హార్దిక్ పాండ్య సోదరుడు, యువ ఆటగాడు కృనాల్ పాండ్య స్పష్టం చేశాడు. ప్రపంచకప్‌లో పాల్గొనే టీమిండియాలో చోటు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ట్వంటీ20 సిరీస్‌కు ఎంపికైన తుది జట్టులో స్థానం సంపాదించలేక పోయాడు. అయితే దేశవాళి క్రికెట్‌తో పాటు ఐపిఎల్‌లో నిలకడగా ఆడడం కృనాల్ అలవాటుగా మార్చుకున్నాడు. ముంబయి సాధించిన విజయాల్లో కృనాల్‌దే కీలక పాత్ర అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈసారి ఎలాగైనా టీమిండియాలో చోటు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీని కోసం ప్రత్యేక ప్రణాళికతో ముందుకు పోతానని కృనాల్ అన్నాడు. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో తన సోదరుడు హార్దిక్ మెరుగైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకోవడం తనకు ఎంతో గర్వంగా ఉందన్నాడు. అతని బాటలోనే నడుస్తూ వచ్చే ప్రపంచకప్ నాటికి వన్డే జట్టులో చోటు సంపాదిస్తాననే నమ్మకాన్ని కృనాల్ వ్యక్తం చేశాడు.

Comments

comments