Home తాజా వార్తలు “క్షణం” ట్రైలర్‌ను విడుదల చేసిన మహేష్‌బాబు

“క్షణం” ట్రైలర్‌ను విడుదల చేసిన మహేష్‌బాబు

పివిపి బ్యానర్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లు కలిసి నిర్మిస్తున్న సస్పె న్స్ డ్రామా ‘క్షణం’. అడవి శేష్, అదాశర్మ హీరోహీరో యిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం లో అనసూయ భర ద్వాజ సరికొత్త పాత్రలో కనపడ నుంది. సత్యేదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవివర్మ ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రధా రులు. ఈ సినిమా ట్రైలర్ ను సూపర్‌స్టార్ మహేష్‌బాబు, సమంతలు విడుద ల చేశారు. రొమాంటిక్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్‌ను చూసి మహేష్… సినిమా యూని ట్ సభ్యులను అభినందించారు. రవికాంత్ పేరెపు దర్శకుడిగా పరిచయ మవుతున్న ఈ చిత్రానికి అడవిశేష్ కథను అందించారు. ఇక ‘క్షణం’ను మార్చి 4న విడుదల చేయడానికి సన్నా హాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్‌ః అర్జున్ శాస్త్రి, రవికాంత్ పెరేపు, స్క్రీన్‌ప్లేః రవికాంత్ పెరేపు, అడవిశేష్, సాహిత్యంః సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ : శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్‌ః అబ్బూరి రవి.