Home తాజా వార్తలు రేపు ఢిల్లీకి వెళ్లనున్న కెటిఆర్, జగన్

రేపు ఢిల్లీకి వెళ్లనున్న కెటిఆర్, జగన్

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో నేడు మధ్యాహ్నం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరగబోయే సమావేశంలో వారు పాల్గొననున్నారు. పార్లమెంట్ సమావేశాలు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ మేరకు ఆయన ఆయా పార్టీలకు గతంలో లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్‌ఆర్‌సిపి నుంచి జగన్, టిఆర్‌ఎస్ నుంచి కెటిఆర్ వెళ్లాలని నిర్ణయించారు. టిడిపి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

KTR and Jagan to go New Delhi