Home తాజా వార్తలు ‘కంచె’ను మెచ్చుకున్న కెటిఆర్

‘కంచె’ను మెచ్చుకున్న కెటిఆర్

KTR-Kancheహైదరాబాద్: ‘కంచె’ చిత్ర బృందాన్ని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా ప్రశంసించారు. ‘ఇప్పుడే కంచె చిత్రాన్ని చూశాను. చిత్రం నాణ్యత, సినిమాటోగ్రఫీ, వరుణ్‌తేజ్, ప్రగ్యా జైశ్వాల్ నటన, క్రిష్ దర్శకత్వం అద్భుతంగా ఉన్నాయి’ అని ట్వీట్ చేశారు. వరుణ్‌తేజ్, ప్రగ్యా జైశ్వాల్ జంటగా క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం గతేడాది అక్టోబరు 22న విడుదలైంది. అప్పట్లో ఈ చిత్రానికి సోషల్‌మీడియా ద్వారా పలువురు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి. ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తెరకెక్కించిన ఈ చిత్రానికి చిరంతన్ భట్ సంగీతం సమకూర్చారు. ‘కంచె’ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే.