Home తాజా వార్తలు కోటి ఎకరాల మాగాణం

కోటి ఎకరాల మాగాణం

kvt

నిజామాబాద్ ఖిల్లా జైలుగోడలపై తెలంగాణ కోటి రతనాలవీణ అని రాశాడు దాశరథి
కోటి ఎకరాల మాగాణిగా చేస్తానని శపథం పూనాడు కెసిఆర్ : మంత్రి కెటిఆర్

గడ్డం పెంచినోళ్లంతా గబ్బర్‌లు కాలేరు
కాంగ్రెస్‌కి దేశం మొత్తం మీద 75 సీట్లు వస్తే గొప్ప
బెయిల్‌గాడీ కాంగ్రెస్ నేతలు రాహుల్, సోనియా బెయిల్‌పై ఉన్నారు
మేం టికెట్లు ఇస్తామంటే ఉత్తమ్, జానా తప్ప మిగతా అందరూ కారెక్కేస్తారు : కెటిఆర్ చురకలు

మనతెలంగాణ/ నిజామాబాద్ ప్రతినిధి : గడ్డం పెంచినోళ్లంతా గబ్బర్‌సింగ్‌లు కాలే రని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. కెసిఆర్ గద్దె దిగేవరకు గడ్డం తీయ బోనని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డం పెంచుకుంటున్నాడని, దాని వల్ల ఒరిగే దేమీ లేదని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ మహానుభావుడు దాశరథి నిజామాబాద్ ఖిల్లా లోని జైలు గోడలపై నా తెలంగాణ కోటి రత నాల వీణ అని రాయగా, తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి సాధించిన కెసిఆర్ ‘తెలంగాణను కోటి ఎకరాల మాగాణి’గా అభివర్ణించారన్నారు.  నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బుధవారం నిర్వహించిన ఐటి హబ్‌కు శంకుస్థాపన, హరితహారం, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. అనంతరం పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో భారీగా హాజరైన విద్యార్థులు, నగర ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఓ వైపు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూనే కాంగ్రెస్, టిడిపిలపై విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ, అమరావతి నేతల వద్ద తాకట్టు పెట్టిన కాంగ్రెస్, టిడిపి నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తల్లిదండ్రులను హత్యచేసిన హంతకుడు క్షమాబిక్ష కోరినట్లుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందన్నారు. కాంగ్రెస్ పాలకుల 55 ఏళ్ల దరిద్రం 4 ఏళ్లలో పోతుందా అని ప్రశ్నిస్తూ ఇప్పుడిప్పుడే తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని కెటిఆర్ వివరించారు. తెలంగాణలోని ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వాలన్న లక్షంతో కెసిఆర్ పనిచేస్తున్నారని వెల్లడించారు. వచ్చే దీపావళి లోపు తెలంగాణలోని ప్రతి ఇంటికి మం చినీరు ఇచ్చి తీరుతామని స్పష్టం చేయడమే కాకుండా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగబోమని తేల్చిచెప్పిన ధైర్యం ముఖ్యమంత్రి కెసిఆర్‌దే అన్నారు. గోదావరి, కృష్ణనీటిని ఒడిసిపట్టి బీడు భూములకు మళ్లించే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుపడుతోందని విమర్శించారు. కెసిఆర్‌ను గద్దెదింపాలంటూ, తరిమికొట్టాలంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదండరాం లాం టి వాళ్లు అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నందుకు గద్దె దింపాలా అని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణలోని వృద్ధులకు, వితంతువులకు నెల కు వెయ్యి రూపాయల పింఛను ఇసున్నామని, వికలాంగులకు రూ.1500 చొప్పున 42లక్షల మందికి ప్రతియేటా రూ. 5600 కోట్లు పింఛన్లు ఇసున్నామని, కళ్యాణలక్ష్మి, షాదిముబారక్‌లతో పేదింటి ఆడపిల్లల వివాహాలకు రూ.1.16లక్షల ఆర్థిక సహాయం చేస్తున్నామని, పేదలకు ఇచ్చే సబ్సిడీ బియ్యం కోటా పెంచామని, నిరుపేద పిల్లలకు హాస్టళ్లలో సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని, నిరుపేద గర్బిణీలకు కెసిఆర్ కిట్ ఇస్తున్నామని, ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ప్రభుత్వాన్ని గద్దె దింపాలా? అని కెటిఆర్ నిలదీసారు. దశాబ్దాల కాలంగా ప్రభుత్వాలకు రైతులు శిస్తు చెల్లించే వారని. కెసిఆర్ గొప్ప ఆలోచనతో రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసి ప్రతి ఎకరాకు ఏడాదికి రూ. 8వేల చొప్పున రూ.12వేల కోట్లు రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నారని కెటిఆర్ గుర్తు చేశారు. దీనికి తోడు ఈ నెల 15 నుండి రూ. 5 లక్షల ప్రమాదబీమాను రైతులకు అందుబాటులో తెస్తున్నామని,అందుకు రూ.1000కోట్లు ఖర్చు చేస్తుండగా కాంగ్రెస్ నేతలకు మింగుడుపడడం లేదని కెటిఆర్ ధ్వజమెత్తారు. గత 55ఏళ్ల పాటు పాలకులుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చిందరవందర రాజకీయాలను మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో ఉంటే, టిడిపి అధిష్టానం అమరావతిలో ఉందని, తమ అధిష్టానం మాత్రం నిజామాబాద్ గల్లీలో ఉందని కెటిఆర్ చెప్పుకొచ్చారు. తాము అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులు ఇప్పుడు గుర్తుకువస్తున్నాయంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించిన కెటిఆర్ నాడు గుడ్డిగుర్రాల పళ్లు తోమారా అంటూ ఎద్దేవా చేశారు. పక్కనే ఉన్న కర్ణాటకలో జనతాదళ్‌తో కలిసి అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాలుగు విడతల్లో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తుండగా ఇక్కడ అధికారంలోకి వస్తే ఒకేసారి రుణమాఫీ చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నిరుద్యోగులకు భృతి ఇచ్చిందా అంటూ ప్రశ్నించారు. తెలంగాణలో అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలన్న లక్షంతో పరిశ్రమలను, ఐటి రంగాన్ని వివిధ జిల్లాల్లో నెలకొల్పుతున్నట్లు కెటిఆర్ వివరించారు. తెలంగాణ ఐటి రంగంలో 2013-14లో రూ. 56 వేల కోట్ల ఎగుమతులు జరుగగా కెసిఆర్ ఇచ్చిన లక్షం రెట్టింపు కాగా ఇప్పటి వరకు లక్ష కోట్ల ఎగుమతులకు చేరుకున్నామని, కొద్ది రోజుల్లో లక్షాన్ని మించిపోతామని వివరించారు. ఐటి రంగా న్ని, పరిశ్రమలను నిజామాబాద్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేస్తున్నట్లు కెటిఆర్ చెప్పారు. తెలంగాణలో 1.12లక్షల కొలువులకు గాను 46వేల ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ద్వారా ఇచ్చామని అన్నారు. మరో వైపు సింగరేణి, ఆర్టీసి, పంచాయతీరాజ్ తదితర విభాగాల్లో పది నుండి 12 వేల ఉద్యోగ అవకాశాలు, ప్రైవేట్ రంగంలో దాదాపు 5.23 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు మంత్రి వివరించారు. తెలంగాణ ఐటి రంగంలో 2013-14లో రూ. 56 వేల కోట్ల ఎగుమతులు జరుగగా కెసిఆర్ ఇచ్చిన లక్షం రెట్టింపు కాగా ఇప్పటి వరకు లక్ష కోట్ల ఎగుమతులకు చేరుకున్నామని, కొద్ది రోజుల్లో లక్షాన్ని మించిపోతామని వివరించారు. ఐటి రంగాన్ని, పరిశ్రమలను నిజామాబాద్‌తో పాటు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్‌నగర్ తదితర గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేస్తున్నట్లు కెటిఆర్ చెప్పారు. తెలంగాణలో 1.12లక్షల కొలువులకు గాను 46వేల ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ ద్వారా ఇచ్చామని అన్నారు. మరో వైపు సింగరేణి, ఆర్టీసి, పంచాయతీరాజ్ తదితర విభాగాల్లో పది నుండి 12 వేల ఉద్యోగ అవకాశాలు, ప్రైవేట్ రంగంలో దాదాపు 5.23 లక్షల ఉద్యోగ అవకాశాలను కల్పించినట్లు మంత్రి వివరించారు. ప్రజలు ఏకపక్షమైన తీర్పునిచ్చి మళ్లీ కెసిఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం వందలాది మంది పిల్లలు బలిదానాలు చేసుకుంటే మంత్రి పదవులను పట్టుకొని వేలాడిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని నిజామాబాద్ జిల్లాకు చెందిన షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డిలపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎంపి కల్వకుంట్ల కవితతో పాటు అర్భన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఇతర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఉత్తమ్, జానా తప్ప టిక్కెటిస్తే అంతా కారెక్కేటోళ్లే
రాష్ట్రంలో 75సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, టిఆర్‌ఎస్ పార్టీ టిక్కెట్టిస్తే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డిలు తప్ప అందరూ కారెక్కేస్తారని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. నిజామాబాద్‌లో బుధవారం పర్యటించిన మంత్రి కెటిఆర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు కెటిఆర్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో 75 సీట్లు రావని, వారు చెప్పే సంఖ్య దేశం మొత్తం మీద వారికి దక్కే సంఖ్య కావచ్చంటూ చురకలంటించారు. కాళేశ్వరంపై విచారణ చేపట్టి జైలుకు పంపుతామని చెబుతున్న కోదండరాం, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలపై కెటిఆర్ మండిపడ్డారు. తప్పుచేస్తే జైలుకు పంపే అధికారం కోర్టులకు మాత్రమే ఉంటుందని, కోదండరాం, ఉత్తమ్‌లు ఎవరని కెటిఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం నీటిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ గుత్తేదారులను బెదిరిస్తోందని, కాళేశ్వరం నీళ్లు ప్రజలకు రావడం ద్వారా కాంగ్రెస్‌కు మిగిలేవి కన్నీళ్లేనని స్పష్టం చేశారు. తమను విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీని మోడీ బెయిల్ గాడీ అన డం సబబేఅని కెటిఆర్ అన్నారు. కాంగ్రెస్ నేతలు రాహు ల్, సోనియాలు బెయిల్‌పైనే తిరుగుతున్నారని గుర్తు చేశారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను వెంటనే ఇస్తామని, అన్‌ఫిట్ కార్మికుల స్థానంలో వారు సూచించిన వారికే ఉద్యోగం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు.ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఆగలేదన్న ఆయన వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో శాసించే స్థాయిని టిఆర్‌ఎస్‌కు కల్పించాలని ప్రజలను కోరుతామన్నారు.