Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

ముందస్తు ఎన్నికలంటే ప్రతిపక్షాలకు భయం: కెటిఆర్

The opening ceremony of the Kaminiène Chaurada flyover

హైదరాబాద్: కెసిఆర్ ప్రభుత్వం నాలుగేళ్లలో  సాధించిన విజయాలను ప్రజలకు వివరించేందుకు సభ ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్ వద్ద జరుగుతున్న ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. 1600 ఎకరాల్లో 25 లక్షల మందితో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 2న అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతుందని, ప్రగతి నివేదన సభ చరిత్రలో నిలుస్తుందన్నారు.  ప్రగతి నివేదన సభ నిర్వహించడానికి ఎనిమిది కమిటీలను ఏర్పాటు చేశామని వివరించారు.

సభకు వచ్చేవారికోసం మెడికల్ క్యాంపులు, మంచినీటి వసతి ఏర్పాటు చేశామని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీకే పట్టం కడుతారని జోస్యం చెప్పారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు. తాము ప్రజల సొమ్మును దాచుకోమని, వారి మనసులను దోచుకుంటామన్నారు. ఎన్నికలలో పైసలు పంచిందో ఎవరో… చిప్పకూడు తిన్నది ఎవరో ప్రజలకు తెలుసునని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.  నాలుగైదు రోజుల్లో ముందస్తు ఎన్నికలపై స్పష్టత వస్తుందని, ముందస్తు ఎన్నికలంటేనే ప్రతిపక్షాలు భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజల ముందుకు వెళ్లాలంటే ప్రతిపక్షాలకు ధైర్యం చాలడం లేదని విమర్శించారు. తాము అధికారం వదులుకోవడానికి సిద్ధంగా ఉంటే ప్రతిపక్షాలు ఆనందం వ్యక్తం చేయాలి… కానీ ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు.

Comments

comments