Home తాజా వార్తలు సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : కెటిఆర్

సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి : కెటిఆర్

KTR Comments on Welfare Schemesరాజన్న సిరిసిల్ల : నాలుగున్నరేళ్లలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తమను గెలించి, మళ్లీ అధికారం కట్టబెడుతాయని మంత్రి , సిరిసిల్ల టిఆర్‌ఎస్ అభ్యర్థి కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఉదయం రాజన్న సిరిసిల్లలో టిఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. సిరిసిల్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశానని ఆయన పేర్కొన్నారు. గతంలో అనేక ఇబ్బందులు పడిన చేనేత కార్మికులు తమ నాలుగున్నరేళ్ల పాలనలో ఆనందంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఇంటింటికి నల్లా కార్యక్రమం పూర్తవుతుందని, నాలుగు కిలోలు ఉన్న బియాన్ని పది కిలోలకు పెంచామని ఆయన చెప్పారు. మహాకూటమి పేరుతో వస్తున్న ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ వందకు పైగా సీట్లు సాధించి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారిని చైతన్యం చేయాలని ఆయన పార్టీ కార్యకర్తలను కోరారు.

KTR Comments on Welfare Schemes