Home రాజన్న సిరిసిల్ల అకాల వర్షాలపై మంత్రి కెటిఆర్ ఆరా

అకాల వర్షాలపై మంత్రి కెటిఆర్ ఆరా

KTR Enquiry Heavy rains damage paddy crop

అకాల వర్షాలపై మంత్రి కెటిఆర్ ఆరా
సిరిసిల్ల కలెక్టర్ కృష్ణభాస్కర్
మనతెలంగాణ/సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురిసిన అకాల వర్షాలు,తడిసిన వరి ధాన్యానికి సంబంధించిన వివరాలు మంత్రి కె.తారక రామారావు ఆరాతీసారని కలెక్టర్ కృష్ణభాస్కర్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ జిల్లాలో అకాల వర్షాలకు తడిసిన వరిధాన్యాన్ని ఆ యన మండలాల్లో పర్యటించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కెటిఆర్ తడిసిన వరి ధాన్యాన్ని రైతులనుండి కొ నుగోలు చేస్తామని చెప్పారని జిల్లా కలెక్టర్ వివరించారు.గురువారం కు రిసిన అకాల వర్షాలవల్ల జిల్లాలోని 30 ధాన్యం కొనుగోలుకేంద్రాల్లో సు మారు 27వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చామన్నారు.రైతులు అధైర్యపడవద్దని,ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరపెట్టాలని రైతులకు సూచించారు. ఆ రపెట్టిన తరువాత ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రైతులకు అన్ని విధా లుగా అండగా నిలుస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.