Home తాజా వార్తలు మంచాల పోలీసులపై కెటిఆర్ ఆగ్రహం

మంచాల పోలీసులపై కెటిఆర్ ఆగ్రహం

ktrహైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మంచాలలో అనుమతి లేదంటూ ద్విచక్రవాహన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీ నిర్వాహకులకు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మంచాల సిఐ అందులోని ఓ యువకుడిపై చేయిచేసుకున్నారు. ఈ అంశాన్ని అమీర్‌బేగ్ అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిఆర్ దృష్టికి తెచ్చారు. ఈ ఘటనపై అంసతృప్తి వ్యక్తం చేసిన కెటిఆర్ ఈ వ్యవహారంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలంగాణ డిజిపిని ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ సిద్ధాంతానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.