Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మంత్రి వర్యా మమ్మల్ని మరిచారా!

KTR-GHMC

ఇల్లంతకుంట : తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పడి నెలలు గడుస్తున్న అమాత్యులు రావడం లేదని ప్రజలు విచారం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ల పునర్వి భజనలో భాగంగా ఇల్లంతకుంట మండలాన్ని ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లాలో విలీనం చేసింది. జిల్లాకు చెందిన మంత్రి కె తారకరామ రావు ఇప్పటి వరకు ఇల్లంతకుంట మండలంలో కాలుమోపక పోవడం విడ్డ్డూరమని పలువురు అంటున్నారు. నూతనంగా ఏర్పడ్డ జిల్లాలో రాష్ట్ర స్థాయిలో కీల కంగా ఉన్న మంత్రి తరచూ పర్యటన లు చేస్తూ తమ సమస్యలను పట్టించుకుని పరిష్కరి స్తాడని గంపెడ శలు పెట్టుకున్న ప్రజల ఆశ అడియాశగానే మిగిలి పోయిందని ప్రజలంటున్నారు.

రాష్ట్రంలో , దేశ విదేశాల్లో ఎన్నో సుడిగాలి పర్యటనలు చేస్తున్న మం త్రి వర్యులకు స్వంత జిల్లాలోని మండలంపై ఎందు కు కనికరం రావడం లేదో అని ప్రజలు వాపోతున్నారు. కెటిఆర్ మండలంలో పర్యటించి పేరుక పోయిన సమస్యలను, ఎంతో ఆశలతో ఉన్న నూతన పనులకు ఆమోదం తెలుపుతాడో అని స్వంత పార్టీ నాయకులే చర్చించు కుంటున్నారు. మంత్రి రాక కోసం మండల ప్రజాప్ర తినిధులు రెండు సార్లూ ప్రయత్నించి కార్యక్ర మాలు ఖరారు చేసిన హాజరు కాలేదు. దీంతో అప్పటి నుండి మంత్రి ని మండలానికి తీసుకరావడానికి మండల ప్రజాప్ర తినిధులు విశ్వప్రయత్నాలుచేస్తున్న, ఈ విషయా న్ని గులాబీ తమ్ముళ్లు బాహటంగానే అంటున్నారు.

జిల్లా ఒక్కటైన ఇల్లంత కుంట మండలం కరీంనగర్ జిల్లాలోనే మానకొండూర్ నియోజవర్గంలో ఉండ డంతో మంత్రి ప్రాధా న్యత ఇవ్వడం లేదని, అందుకే మండలంపై , అభి వృద్ధిపై దృష్టి సారించడం లేదనే వాదనలు వినిపి స్తున్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా లోని తన స్వంత నియోజవర్గంలోనే వరుస పర్యటనలు చేస్తూ కూత వేటు దూరంలో ఉన్న మండలంలో పర్యటించుక పోవడంపై ఈ వాదనలు బలం చేకూరుస్తున్నాయి. రాష్ట్రంలో నే నెంబర్ టూ గా ఉన్న మంత్రి ఇల్లంతకుంట మండలంలో పర్య టించి అభివృద్ధిపై దృష్టి సారించి, గులాబీ తమ్ముళ ్లతో సత్సంబంధాలను పెంచుతూ ప్రజల కష్టసుఖాల ను తీర్చాలని పలువురు కోరుకుంటున్నారు.

Comments

comments