Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

‘ఆరెంజ్’లాంటి కళ, కలర్స్ ఉన్న ‘కాదలి’: రాంచరణ్

kaadhaliపట్టాబి ఆర్.చిలుకూరి స్వీయ దర్వకత్వంలో అందరూ కొత్తవారితో తెరకెక్కుతున్న ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మూవీ ‘కాదలి’. పూజా కె.దోషి, హరీష్ కళ్యాణ్, సాయి రోణక్, సుదర్శన్, మోహన్ రామన్, డా.మంజేరి షర్మిల, గురురాజ్ మానేపల్లి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రసన్ ప్రవీణ్ శ్యామ్ సంగీత సారధ్యం వహించారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కెటిఆర్, రామ్‌చరణ్, సురేష్‌బాబు, దిల్‌రాజు, దశరథ్‌తో పాటు ‘కాదలి’ చిత్ర బృందం పాల్గొంది. రామ్‌చరణ్ ‘కాదలి’ ఆడియో బిగ్ సీడీని లాంచ్ చేయగా… కెటిఆర్ ఆడియోను ఆవిష్కరిం చారు. తొలి సీడీని నిర్మాత సురేష్‌బాబు అందుకు న్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ “పట్టాభి ఆర్.చిలుకూరి నా బాల్య మిత్రుడు. తన కల ఈ సినిమా. అంతా కొత్తవారితో చేస్తున్న ఈ సినిమా చాలా రిఫ్రెషింగ్‌గా ఉంది. ట్రైలర్ చాలా బావుంది. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఇక ఒక దేశానికి ఒక ట్యాక్స్ అనేది మంచిదే. కానీ సినిమాలపై 28 శాతం జిఎస్‌టి ట్యాక్స్ విధిస్తే మంచిది కాదు. ఈమధ్య కమల్‌హాసన్ కూడా దీని గురించి మాట్లాడారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలన్నీ కలిసి అరుణ్‌జైట్లీని కలుద్దాం”అని అన్నారు. రామ్‌చరణ్ మాట్లాడుతూ “నా కెరీర్‌లో మోస్ట్ ఫేవరేట్ చిత్రం ‘ఆరెంజ్’. అలాంటి సినిమాను మళ్లీ చేయాలని అనుకుంటున్నాను. అలాంటి కళ, కలర్స్ ఉన్న ఈ సినిమా మంచి విజయాన్ని అందు కుంటుందన్న నమ్మకం నాకుంది. సినిమా అంటే ప్యాషన్ ఉన్న పట్టాభికి కంగ్రాట్స్. నా తొలి సినిమాలో కూడా నేను ఇంత బాగా చేయలేదేమో. ఈ సినిమాలోని నటీనటులు అంత బాగా చేశారు”అని చెప్పారు. సురేష్‌బాబు మాట్లాడుతూ “ఇప్పుడు సినిమాలపై 28 శాతం జిఎస్‌టి ట్యాక్స్ విధించారు. దీనివల్ల ప్రాంతీయ భాషా చిత్రాలకు పలు ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రాంతీయ భాషా చిత్రాలకు జిఎస్‌టి తగ్గించాలని కోరుతున్నాం. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎప్పటి నుంచో మద్ధతిస్తున్న కెటిఆర్ ఈ విషయంలో సహకరించాలి”అని తెలిపారు.

Comments

comments