Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

అండ నిలవండి

ktr

రాష్ట్రంలో 10 చోట్ల చేనేత క్లస్టర్ల ఏర్పాటుకు, పవర్‌లూమ్‌ల ఆధునికీకరణకు తోడ్పడండి
కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కెటిఆర్ విజ్ఞప్తి

మన తెలంగాణ / న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలో పవర్‌లూమ్ ఆధునీకరణ, 10 చేనేత క్లష్టర్ల ఏర్పాటుకు తోడ్పాటు నివ్వాలని కేంద్ర చేనేత, టెక్స్‌టైల్స్ మంత్రి స్మృతి ఇరానీకి రాష్ట్ర చేనేత శాఖ మంత్రి కెటి. రామారావు విజ్ఞప్తి చేశారు. నేతన్నకు చేయూతనిచ్చేందుకు తమ ప్రభుత్వం ఇప్పటికే రూ.1200 కోట్లతో పథకాలను ప్రవేశ పెట్టిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో కొత్త హ్యాండ్లూమ్ క్లష్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వీటిలో చౌటుప్పల్, కొయ్యలగూడెం, అరగిద్ద, మట్టెవాడ, సిద్దిపేట, కుంట్లగూడెం, గద్వాల, ఎక్లాస్‌పూర్, గొర్లకాన్ దొడ్ది, గట్టు ఉన్నాయన్నారు. వీటితో పాటు ఖమ్మం జిల్లాలోని మధిర, ముజ్జిగూడెం, పొన్నకల్లు, దుబ్బాక, అమరచింత, బచ్చన్నపేట, పాలకుర్తిలో కూడా క్లష్టర్లను ఏర్పాటు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రికి కెటిఆర్ తెలిపారు. ఇందులో కనీసం మరో 10 చేనేత క్లష్టర్లను తెలంగాణకు మం జూరు చేయాలని కెటిఆర్ కోరారు. అలాగే సిరిసిల్ల, నల్గొండ తదితర ప్రాం తాల్లో మగ్గాల ఆధునీకరణలో 50 శాతం కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సి ఉందన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి కెటిఆర్ మంగళవారం నాడు కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. హ్యాండ్లూమ్, పవర్ లూమ్ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్మృతి ఇరానీకి వివరించారు. చేనేత, మరమగ్గాల పరిశ్రమ మేజర్ ఇండస్ట్రిగా తెలంగాణలో వృద్ధి చెందుతోందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 35,762 పవర్ లూమ్‌లు వస్త్ర ఉత్పత్తిలో ఉన్నాయన్నారు. పవర్‌టెక్స్ ఇండియా సదస్సును పరస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ ఒకటిన పవర్‌టెక్స్ పేరిట ఒక పథకాన్ని ప్రకటించిందన్నారు. పవర్‌లూమ్ రంగానికి చేయూత నిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం లో చేరిందని, 50 శాతం కేంద్రం వాటాను పొంది తెలంగాణలో ఈ రం గానికి సహాయ సహకారం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ పథకంలో తెలంగాణకు నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని ఈ సందర్భంగా స్మృతి ఇరానీ దృష్టికి తీసుకు వచ్చారు. అలాగే 8 వేల మగ్గాలు ఆధునీకరణ పనులు వేగంగా సాగడం లేదని కేంద్ర మంత్రికి చెప్పినట్లు కెటిఆర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మగ్గాలను ఆధునీకరిస్తు న్నా, కేంద్రం నుండి అందాల్సిన నిధులు అందడం లేదన్నారు. నూతనంగా ఏర్పాటు చేసే చేనేత క్లష్టర్లు చేనేత కార్మికులు, కళాకారులను ఆధుకునే విధంగా ఉంటాయన్నారు. సిరిసిల్ల, నల్గొండ ప్రాంతాల్లో పవర్‌లూమ్‌ల ఆధునీకరణ దిశగా ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. అంతే కాకుం డా జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం (నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్ ) కింద బ్లాక్ స్థాయిలో పోచంపల్లి, వేములవాడ, కమలాపూర్, ఆలేరు, వెల్టూరు, ఆర్మూరు, శాయంపేట, కనుకులలో చేనేత కార్మికుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. ఇలా చేనేత కార్యక్రమాలన్నీ పూర్తి చేసేందుకు కేంద్రం వైపు నుండి సకాలంలో సహకారం అందించాలని కోరారు. తమ విజ్ఞప్తి మేరకు నిధుల విడుదలలో జాప్యాన్ని పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

Comments

comments