Home తాజా వార్తలు రక్షణ శాఖ భూములను బదలాయించండి: కెటిఆర్

రక్షణ శాఖ భూములను బదలాయించండి: కెటిఆర్

KTR Requests Nirmala sitaraman

హైదరాబాద్: పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ నగరంలో స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖకు చెందిన భూములను వీలైనంత త్వరగా బదలాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు.  బెంగళూరులో మౌలిక సదుపాయాల కల్పన కోసం 210 ఎకరాల రక్షణ శాఖ భూములను బదలాయించిన అంశాన్ని ట్విట్టర్‌లో  ఆయన ప్రస్తావించారు. అలాగే హైదరాబాద్‌లో స్కైవేల నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు కోరుతున్న అంశాన్ని గుర్తు చేశారు. బెంగళూరు తరహాలోనే హైదరాబాద్‌లోనూ 160 ఎకరాల రక్షణశాఖ భూములు ఇవ్వాలని గత రెండేళ్లుగా అడుగుతున్నామని మంత్రి పేర్కొన్నారు.