Home తాజా వార్తలు కొత్త ప్రాంతాలకు ఐటి పరిశ్రమల విస్తరణ : కెటిఆర్

కొత్త ప్రాంతాలకు ఐటి పరిశ్రమల విస్తరణ : కెటిఆర్

KTR

హైదరాబాద్: ఐటి పరిశ్రమలను నలు దిశాల విస్తరించేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఐటి శాఖ మంత్రి కెటిఆర్‌ అన్నారు.  ఐటి విస్తరణ, భవిష్యత్ కార్యచరణపై మంత్రి కెటిఆర్ మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఐటి పరిశ్రమల విస్తరణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యూహాలపై మంత్రి మాట్లాడారు. ఉప్పల్, నాగోల్, సనత్ నగర్, మేడ్చల్, కొంపల్లిలో పరిశ్రమల స్థాపనపై ఈ సమీక్షలో కెటిఆర్ అధికారులతో చర్చలు జరిపారు. హైదరాబాద్‌లో ఐటి ఎగుమతులు రూ.లక్ష కోట్లకు చేరుకుంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ఎంపి బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ సలహాదారు వివేక్, ఐటి, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, పలువురు ఉన్నతాధికారులు హజరయ్యారు.