Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బతుకమ్మ చీరలపై మంత్రి కెటిఆర్ సమీక్ష…

ktr-image

హైదరాబాద్:  తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ పండగ సందర్భంగా ఒక చీర కానుక ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. బతుకమ్మ చీరల తయారీ, గుండ్లపోచంపల్లి, పాశమైలారంలోని అపెరల్ ఎక్స్‌పోర్ట్ పార్క్ పురోగతిపై కెటిఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ… సెప్టెంబర్ చివరి నాటికి బతుకమ్మ చీరలు అందించాలని కెటిఆర్ ఆదేశించారు. ప్రస్తుతం చీరలను నేస్తున్న వేగానికి లూమ్‌లను ఇంకాస్త పెంచి ఓవర్ టైమ్ పనిచేయాలని చెప్పారు. రాజన్నసిరిసిల్లలో ప్రస్తుతం 10 వేల లూమ్‌లపై చీరల నేత కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. నిర్ణీత ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకోవడానికి కనీసం 20 వేల లూమ్‌లపై చీరల ఉత్పత్తి జరగాల్సి ఉందని కెటిఆర్ అభిప్రాయపడ్డారు. సిరిసిల్లలోని నేతన్నలకు ముఖ్యంగా పవర్‌లూమ్ కార్మికులకు ఆదాయాన్ని పెంచి వారి జీవన ప్రమాణాలను పెంచే ఉద్ధేశ్యంతోనే సిఎం కెసిఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆయన పేర్కొన్నారు. ఎంతో నమ్మకంతో సిరిసిల్ల నేత కార్మికులకు ఇచ్చిన చీరల ఆర్డర్‌ను నిలబెట్టుకుని నిర్ణయించిన గడువులోగా వాటిని పూర్తి చేయాలన్నారు. టెక్స్‌టైల్‌శాఖ కమిషనరేట్ నుంచి చీరల ఉత్పత్తి కార్యక్రమాన్నిపర్యవేక్షించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. కనీసం నాలుగుసార్లు అయిన అధికారులు సిరిసిల్లలో పర్యటించాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.

Comments

comments