Home తాజా వార్తలు టిఎస్‌ఐఐసి ప్రాజెక్టులపై కెటిఆర్ సమీక్ష

టిఎస్‌ఐఐసి ప్రాజెక్టులపై కెటిఆర్ సమీక్ష

KTR

హైదరాబాద్: టిఎస్‌ఐఐసి ప్రాజెక్టులపై రాష్ట్ర ఐటి, పరిశ్రమలశాఖ మంత్రి కెటిఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో పారిశ్రామిక పార్కుల పురోగతిపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడాడు. పారిశ్రామిక పార్కుల పనులు వేగవంతం చేయాలన్నారు. అన్ని పార్కుల వివరాలతో సమగ్ర నివేదిక రూపొందించాలని, ఉప్పల్ లో నిలిపివేసిన కంపెనీలతో, పరిశ్రమల అధికారులతో భేటీ కావాలని సూచించారు. కాలుష్య కారక కంపెనీలను నగరం వెలుపలకు తరలించే అంశాన్ని పరిశీలించాలని, కాలుష్య కారక కంపెనీల యజమానులతో సమావేశం నిర్వహించాలన్నారు. ఐటి వంటి కాలుష్య రహిత పరిశ్రమల ఏర్పాటు అవకాశాలను పరిశీలించాలని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.