Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఎంఎంటిఎస్ ఫేజ్-2పై కెటిఆర్ సమీక్ష

ktr-image

హైదరాబాద్: నగరానికి సంబంధించిన రైల్వే అంశాలపై ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సంబంధిత అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్ కుమార్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసి కమిషనర్ జనార్ధన్ రెడ్డి, మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ క్రమంలో ఎంఎంటిఎస్ ఫేజ్-2 పనులతో పాటు రైల్వేే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణాలపై చర్చలు జరిపారు. చర్లపల్లి, నాగులపల్లి దగ్గర కట్టబోయే రైల్వే టెర్మినళ్లకు చెందిన అంశాలపై రెండు వారాల్లో సమీక్ష నిర్వహిచనున్నట్టు ఆయన తెలిపారు.

 

Comments

comments